ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeఎడిటోరియల్రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

ప్రపంచ పేషెంట్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్‌సిడి అధికారుల ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ పర్యవేక్షణలో ఆసుపత్రికి విచ్చేస్తున్న రోగుల కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతోంది.

​సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఒక వారం రోజుల పాటు ఈ అవగాహన సదస్సులు కొనసాగనున్నాయి. నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలను వేధిస్తున్న పలు దీర్ఘకాలిక మరియు అసంక్రమిత వ్యాధులపై రోగులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా షుగర్ (మధుమేహం), అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్), పక్షవాతం (పారాలిసిస్), కిడ్నీ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ మరియు వివిధ మానసిక ఒత్తిడి వ్యాధుల లక్షణాలు, వాటిని ముందస్తుగా గుర్తించే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ వివరిస్తున్నారు.

​ఈ వారం రోజుల పాటు సాగే కార్యక్రమంలో భాగంగా వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది ప్రతిరోజూ ఒక నిర్దిష్టమైన ఆరోగ్య అంశం (టాపిక్)పై ప్రత్యేక ప్రసంగాలు చేస్తూ, రోగులకు తగు సూచనలు ఇస్తున్నారు. వ్యాధులు రాకముందు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై వైద్యులు ఇస్తున్న సలహాలు రోగులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

​ఈ ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో ఆసుపత్రి డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు గొల్లపల్లి కృష్ణతో పాటు వివిధ విభాగాల మెడికల్ ఆఫీసర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది మరియు ఆసుపత్రి సిబ్బంది అందరూ తదితరులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img