ePaper
Tuesday, November 3, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

📰 Generate e-Paper Clip

[BREAKING NEWS] మండలం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK):

నేటి సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగింపు

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: రాయవరం ఎస్సై సురేష్ బాబు 

ఈ నెల 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుందని రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ప్రచార గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఓటర్లకు డబ్బులు ఇతర వస్తువులు ఆశ చూపి ప్రలోభపెట్టడం, బెదిరించడం, ఇతర అభ్యర్థులపై దుష్ప్రచారం చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అభ్యర్థులు పోలీస్ శాఖకు సహకరించాలని, ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఎస్సై సురేష్ బాబు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img