Draksharama (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
ద్రాక్షారామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన శరత్ చంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆకర్షణీయమైన జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కొమ్ముల మంగరాణి మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి పోటీలలో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ ఇంటర్వ్యూలను ఎంతో సులభంగా ఎదుర్కొని, ఉన్నత స్థానాల్లో స్థిరపడగలరని పేర్కొన్నారు. అందువల్ల విద్యార్థులందరూ ఇలాంటి పోటీలలో ఎక్కువగా పాల్గొనాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు కొమ్ముల శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెరిచర్ల శేఖర్, ఉపాధ్యాయులు కె.వి.ఎస్.ఎన్. మూర్తి, ఖాజా మొహిద్దీన్, విస్సు, అమ్మానాచారి, శ్రీరామ చంద్రమూర్తి, ఆని శ్రీనివాస్, ఉమ తదితరులు పాల్గొన్నారు.

