ePaper
Monday, November 16, 2026
ePaper
Homeఎడిటోరియల్మంత్రి సుభాష్ సమక్షంలో టీడీపీలోకి వైసీపీ శ్రేణులు

మంత్రి సుభాష్ సమక్షంలో టీడీపీలోకి వైసీపీ శ్రేణులు

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.రామచంద్రపురం రూరల్ మండలం వెలంపాలెంలో ఈరోజు మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో వైసీపీకి చెందిన 25 మంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్ నాయకులు చల్లా శ్రీనివాస్, వెన్నపు శ్రీనివాస్, పువ్వల అప్పన్న, మందపాటి రాజశేఖర్, పసుమర్తి పాండు, పసుమర్తి కృష్ణ తదితరులు టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన, ప్రజా సంక్షేమ దృక్పథం, మంత్రి నారా లోకేష్ యువత భవిష్యత్తు కోసం చేస్తున్న కృషి రాష్ట్రానికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయని పేర్కొన్నారు.రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలుపుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని, అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ వెంట వెలంపాలెం ఎంపీటీసీ అద్దంకి గంగార్జున, సొసైటీ అధ్యక్షులు ముప్పనపల్లి గణేష్, టేకుమూడి సత్యనారాయణ, శాఖ బాబి, కర్రీ రవీంద్ర, నంగి గోవిందు, పలివెల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img