RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
సర్పంచ్ స్థానాలకు 144 నామినేషన్లు ఆమోదం.. వార్డు సభ్యుల స్థానాలకు 623 నామినేషన్లు సక్రమం
రామచంద్రపురం మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలు–2026 రెండో విడతకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం పూర్తయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి, సక్రమంగా ఉన్న నామినేషన్లను ఆమోదించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెల్లడించారు. మండలంలోని 25 సర్పంచ్ స్థానాలకు మొత్తం 172 నామినేషన్లు దాఖలవగా, పరిశీలన అనంతరం 144 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. అదేవిధంగా 262 వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 633 నామినేషన్లు దాఖలవగా, పరిశీలన అనంతరం 623 నామినేషన్లు ఆమోదం పొందాయి. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో తదుపరి ఎన్నికల ఘట్టంపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.

