Draksharama (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జడ్జి పి. రజిని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ సంప్రదాయాల ప్రకారం మర్యాదలు నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గా భవాని, ఆలయ అర్చకులు పాల్గొని జడ్జి పి. రజిని, కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆధ్యాత్మిక విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతను వివరించారు.

