ePaper
Monday, November 23, 2026
ePaper
Homeరాజకీయంకేశవరంలో పద్మ వెంకన్నబాబు దంపతుల ఇంటింటి ప్రచారం...

కేశవరంలో పద్మ వెంకన్నబాబు దంపతుల ఇంటింటి ప్రచారం…

📰 Generate e-Paper Clip

Mandapeta (Mandapeta), East Godavari (VISWAM VOICE DESK):

గ్రామాభివృద్ధికి అవకాశం కల్పించాలని ప్రజలను కోరిన వెంకన్నబాబు…

 

ప్రజలతో మమేకమవుతూ సాగిన ఎన్నికల ప్రచారం

మండపేట మండలం కేశవరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన దూలం పద్మ వెంకన్నబాబు చేస్తున్న ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తమ ఆదరణను తెలియజేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం దూలం పద్మ వెంకన్నబాబు దంపతులు గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు తన సతీమణి, విద్యావంతురాలైన పద్మకు సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని వెంకన్నబాబు ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img