విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
పాఠశాలకు రామచంద్రారెడ్డి చేస్తున్నవితరణ కార్యక్రమాలు అభినందనీయమని పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రగతి రామారెడ్డి తెలిపారు.
మండలం పసలపూడి గ్రామంలో సోమవారం ద్వారంపూడి మంగయ్యమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు ద్వారంపూడి రామచంద్రారెడ్డి పసలపూడి గ్రామంలో కర్రి సుబ్బారెడ్డి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్)నకు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రగతి రామారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరుమిల్లి వెంకటరమణ విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో సుమారు 20,000 రూపాయల విలువ చేసే బీరువాను బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రగతి రామారెడ్డి మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల పాఠశాలలలోని విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారని, పలు గ్రామాలలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాల వారికి ఆర్థిక సహాయం అందజేశారని రామచంద్రారెడ్డి చేస్తున్న వితరణ కార్యక్రమాలను అభినందిస్తున్నామని (మెయిన్) పాఠశాలకు బీరువా అందజేయటం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు తాడి. లక్ష్మణరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరుమిల్లి వెంకటరమణ, మరియు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.