ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeఎడిటోరియల్కే. గంగవరం జడ్పీటీసీ అభ్యర్థిగా సిర్రా సురేష్‌కు అవకాశం కల్పించాలి

కే. గంగవరం జడ్పీటీసీ అభ్యర్థిగా సిర్రా సురేష్‌కు అవకాశం కల్పించాలి

📰 Generate e-Paper Clip

K. GANGAVARAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలోనూ పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుల్లో సిర్రా సురేష్ ఒకరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ చేపట్టిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, కే. గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ మంత్రి వాసంశెట్టి సుభాష్ విజయానికి, తెలుగుదేశం పార్టీ గెలుపునకు తన వంతు సహకారం అందిస్తూ పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన సిర్రా సురేష్‌కు అమలాపురం పార్లమెంటరీ కమిటీలో కార్యదర్శిగా బాధ్యతలు కల్పించడం ఆయన సేవలకు గుర్తింపుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం కే. గంగవరం మండల జడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక నేపథ్యంలో సామాజిక న్యాయానికి, అన్ని వర్గాల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కాజులూరు మండలంలో ఎస్సీ మహిళా రిజర్వేషన్, కే. గంగవరం మండలంలో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ నేపథ్యంలో సామాజిక సమతుల్యతకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని పలువురు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన సిర్రా సురేష్‌కు కే. గంగవరం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు, మండల మాదిగ సామాజిక వర్గ పెద్దలు కోరుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడిన నాయకులను గుర్తించి తగిన రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.

మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తూ సిర్రా సురేష్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతారని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం చేసిన సేవలను, సామాజిక వర్గ ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కే. గంగవరం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా సిర్రా సురేష్‌కు అవకాశం కల్పించాలని నియోజకవర్గ పార్టీ నాయకత్వానికి, ఎన్నికల పరిశీలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img