విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం,సమాచార పౌర సంబంధాలు,సినిమాటోగ్రఫీ మంత్రిగా సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులోని ఆయన చాంబరులో ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తదుపరి ఉ.10.26 గం.లకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఈసందర్భంగా మంత్రి వేణుగోపాల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలు ప్రతి పేదవానికి అందించడం ద్వారా సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.ముఖ్యంగా నవరత్నాల ఫలాలను పేదలందరికీ అందేలా పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వివరించారు.వివిధ సంక్షేమ పధకాల లబ్దిని ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి) కింద ఆయా పధకాల లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేయడం జరుగుతోందని తెలిపారు.అంతేగాక పరిపాలనా విధానంలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాల్లో సుమారు 139 పైగా కులాలుండగా మంత్రివర్గంలో 70శాతం బిసి,ఎస్సి,ఎస్టి,మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘణత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ చెప్పారు.ప్రతి వర్గానికి సామాజిక న్యాయాన్నికల్పించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులకు ఇళ్ళ స్థలాలు సమకూర్చడం వంటి వివిధ అంశాలను ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్ళి వారితో చర్చించి ఆయా అంశాలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి వేణుగోపాల కృష్ణ చెప్పారు.
రాష్ట్రంలో సినిమా రంగ పరిశ్రమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని కావున రానున్న రోజుల్లో సినిమా రంగాన్ని అన్ని విధాలా విస్తరింప చేసేందుకు సినిమాటోగ్రఫీ మంత్రిగా అవసరమైన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వెల్లడించారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, ఆశాఖ కమీషనర్ అర్జునరావు,ప్రభుత్వ చీఫ్ విఫ్ ప్రసాదరాజు,బిసి కమీషన్ మెంబర్ సెక్రటరీ రాజు,బిసి సంక్షేమశాఖ అదనపు సంచాలకులు మాధవీలత,సమాచారశాఖ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత,చీఫ్ ఇన్పర్మేషన్ ఇంజనీర్ ఓ.మదుసూధన,జాయింట్ డైరెక్టర్లు పి.కిరణ్ కుమార్,టి.కస్తూరి భాయి,బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ డెవల్మెంట్ అధికారి భీమశంకరం తదితరులు పాల్గొన్నారు.