Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గురువుల బోధనలే విద్యార్థులు ఉన్నత కి కారణం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

గురువుల బోధనలే విద్యార్థులు ఉన్నతికి కారణం అవుతాయని డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో బుదవారం శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పూర్వ విద్యార్థుల అయిన మల్లిడి వెంకట కృష్ణారెడ్డి, ( పాలకేంద్రం బుల్లి అబ్బులు) కుమారుడు సాప్ట్వేర్ ఇంజనీర్ వీర రాఘవ రెడ్డి, స్వర్గీయ డ్రిల్ మాస్టర్ రంగయ్య కుమారుడు దయాసాగర్ ( మహర్షి) ఆధ్వర్యంలో పాఠశాల స్థాపించి సుమారు 72 సంవత్సరాలు అయిన కారణంగా పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు పౌర సన్మానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాణిక్య నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి, అనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేతల సుబ్బిరామిరెడ్డి, ఎంపీపీ నౌడు వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎందరో దేశ విదేశాలలో ఉన్నత స్థానాలను అధిరోహించారని, వారి ఉన్నతికి కృషి చేసిన గురుదేవులు పూజించు కోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాస్ రెడ్డి కి జి ఎస్ ఎన్ రెడ్డి, సుబ్బిరామిరెడ్డి, ఎంపీపీ చేతుల మీదుగా దుశాలువా కప్పి , జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ నేపద్యంలో హెచ్ ఎం శ్రీనివాస్ రెడ్డి గ్రామ పెద్దలను ఉద్దేసించి మాట్లడుతూ స్కూల్ అభివృద్ధి సహకరించిన గ్రామ పెద్దలకు, ఉపాద్యాయులను సత్కరించాలని ఆలోచన వచ్చిన వీర రాఘవ రెడ్డి, దయాసాగర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు పాద పూజ చేసి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్ర మళ్ళ రామకృష్ణ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పులగం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ గంటి రోజా, పి ఎం సి చైర్మన్ నల్లమిల్లి నరేంద్ర రెడ్డి, పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ టీవీఎస్ చౌదరి, గ్రామ నాయకులు మంతెన అచ్యుత రామరాజు, పడాల కమలా రెడ్డి, కొల్లు రాంబాబు, మల్లిడి రుద్రారెడ్డి, తమలపూడి గంగాధర్ రెడ్డి, పూర్వ విద్యార్థుల అయిన టెంటు సత్యనారాయణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement