Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అధికారం రాగానే…””అందలం అంటే ఇదే””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆమె నిబంధనలు విస్మరించి ప్రజల పై నిరంకుశ పాలన
– విధుల్లో సమయపాలన లేదు…ప్రజా పాలన కోసం
అభివృద్ధి పట్టదు…
– సిబ్బందితో సమీక్షలు ఉండవు. ఆమె చెప్పిందే వేదం.
– అలంకార ముసుగులో ఆ అధికారి తీరు.
– రాయవరం ఎంపీడీవో తీరుపై ఉద్యోగులు, ప్రజలు అసహనం..
– ఉన్నతాధికారులు పట్టించుకోక పోతే ప్రభుత్వంకి చెడ్డ పేరే.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

(ఉద్యోగం రాక ముందు ఒకలా…? ఉద్యోగం వచ్చిన తరువాత మరోలా…? ఇక ఆ ఉద్యోగం ప్రోమోషన్ వస్తే …ఆ అధికారి తీరు కన్నుమిన్ను కానకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి, సాటి అధికారులను కూడా లెక్క చేయకుండా, ఉన్నతాధికారుల మాటలను భేఖాతరు చేస్తూ, తన సిబ్బందితో అడ్డు అదుపు లేకుండా తన సొంత పనులు చేపించుకుంటూ.. ప్రజల పాలన మరచి తన ఇస్టా రాజ్యంగా ప్రవర్తిస్తూ… నేనే రాజు నేనే మంత్రి అన్న తీరుగా ఒక అధికారి తీరు ఆ మండల ప్రజల ను విస్మరిస్తుంది. ఈ విధంగా ప్రవర్తించేది ఎవరా అని అనుకుంటున్నారా.. ఎవరో కాదండి మన మండల ప్రజాపరిషత్ అధికారి. కనీసం మండల ప్రజలు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ ఏదైనా పని మీద ఎంపిడిఓ కి సమస్యను తెలియ పర్చాలంటే ప్రజా ప్రతినిధుల ఫోన్ ఎత్తరు. ప్రజలకు ఆమె ఫోన్ నెంబర్ చెప్పరు. మరి ఈ అధికారి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఉన్నతాధికారులు తేల్చి చెప్పాలని స్థానిక ప్రజలు అంటున్నారు. ఎంపిడిఓ ప్రజల పాతిక ఎలా ప్రవర్తిస్తుందో ఆ అధికారి తీరుపై ప్రత్యేక కథనం మీ విశ్వం వాయిస్ లో…. )

రాయవరం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో వి. అరుణ తీరు అర్థం కాక అధికారులతో పాటు ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే రాయవరం ఎంపీడీవో పనిచేసిన ఎం శ్రీను పదోన్నతి పై వెళ్లడంతో సూపరిండెంట్ ఎం హరికృష్ణ రెడ్డి కొంతకాలంగా ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయి ఎంపీడీవోగా వి అరుణ బాధ్యతలు చేపట్టారు.
అప్పటి నుండి సుమారు 3 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆమె తీరు వివాదాస్పదమవుతోంది.
ఉద్యోగులతో పాటు ప్రజలు విస్మయానికి గురిచేస్తుంది. . బాధ్యతలు చేపట్టి నెలలు గడుస్తున్నా ఎంపీడీవో ఫోన్ నెంబర్ కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. మండలంలో ఉన్న గ్రామ సచివాలయాలు పరిధిలో శానిటేషన్, రక్షిత మంచి నీరు, వీధిలైట్లు, వంటి సౌకర్యాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయి. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని ఎంపీడీవో కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే అమే విధుల్లోకి చేరి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక సమీక్ష సమావేశం కూడా లేదని ఉద్యోగుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అమే కార్యాలయానికి ఎప్పుడు వస్తారు.. తిరిగి ఎప్పుడు వెళ్తారు తెలియని అయోమయ పరిస్థితి. జాతీయ ఉపాధి హామీ పనులు పర్యవేక్షించి ఉండగా ఇప్పటివరకు ఎన్ఆర్ఈజీఎస్ పనులపై ఆమె ఒక సమీక్ష కూడా నిర్వహించ లేదంటే ఆమె తీరు ఏ విధంగా ఉందో అర్థం పడుతుంది. గ్రామ సచివాలయం పరిధిలో వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి ఎంపీడీవో సమీక్షించాల్సిన ఉండగా ఆ సమీక్ష కూడా లేకుండా పోయింది. అయితే కార్యాలయ సిబ్బంది పై ఆమె వేధింపులు తప్పడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. కిందిస్థాయి ఉద్యోగుల మీదకి ఆదేశాలు ఇస్తు మొత్తం పాలన వారి చేతిలో వదిలేశారు.
ఆమె తనకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, తన ఫోన్ నెంబర్ సమాచార హక్కు చట్టం నోటీస్ బోర్డ్ లో ఎంపీడీవో ఫోన్ నెంబరు ఇవ్వవద్దని ఎంపీడీవో ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ నోటీస్ బోర్డులో కూడా ఫోన్ నెంబర్ వేయలేదు. ఎంపీడీవో పరిధిలో ఉన్న అన్ని శాఖల సమన్వయం చేసుకుని ముందుకు నడిపించాల్సిన అధికారి తనకేమీ పట్టనట్టు వ్యవహరించడంతో పలు గ్రామ సచివాలయ ఉద్యోగులు, పలు మండల అధికారులు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది. ఆ కార్యాలయంలో పర్మినెంట్ అటెండర్ లేకపోవడంతో ఎంపీడీవో కి కిందిస్థాయి అధికారులు అటెండర్ గా విధులు కొనసాగిస్తున్నారు. పలు కింది స్థాయి ఉద్యోగులు ఎంపీడీవో వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారని, ఆరోపణలు ఉన్నాయి. ఎంపీడీవో తీర్పుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులతో వారి దృష్టికి తీసుకువెళ్లిన ఆమె తీరు మారలేదని సమాచారం. ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా తను మాత్రం తన సీట్లో నుంచి కదిలేది లేదని
తన్ను అధికారంగా బదిలీ చేస్తే వెళ్ళిపోతాను అంటూ ఆమె చెప్పినట్టు జిల్లా స్థాయి అధికారులుకు తెలిపినట్లు తెలియవచ్చింది…
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఎంపీడీవో తీరుపై స్పందించి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..

మూడు నెలలుగా జీతాలు లేవు

ఈ సమస్యపై మండలంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎంపీడీవో తీరుపై విశ్వం వాయిస్ ప్రతినిధి ఎంపీడీవో ను వివరణ కోరగా తాను మూడు నెలలుగా జీతం లేకుండానే విధులు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటున్నాను అంటూ ఆమె వివరణ ఇచ్చారు.
ఎంపీడీవో, వి అరుణ, రాయవరం

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement