మండపేట ఎమ్మెల్యే వీడియో నాగేశ్వరరావు.
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
ఈ ఖర్మ ఇంకెన్నాళ్లు అంటూ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో గురువారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో
గ్రామశాఖ అధ్యక్షుడు వెలుగుబంట్ల గోపీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన, చంద్రన్న బీమా, కాపుల రిజర్వేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టి సామాజిక వర్గాలకు, మైనారిటీలకు 50 శాతం సబ్సిడీతో ఇచ్చే రుణాలు రద్దు. ఆదరణ పథకం రద్దు, క్రిస్టమస్, సంక్రాంతి, రంజాన్ తోఫాలు రద్దు, తదితర సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని దుయ్యబట్టారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. అధికారం చేపట్టిన నాటి నుండి నిత్యావసర సరుకులు,పెట్రోల్ ,డీజిల్ , విధ్యుత్ చార్జీలు పెంచి ప్రజల నుండి వసూలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు పేరుతో ఒక చేతితో ఇస్తూ మరొక చేతితో దానికి రెట్టింపు తీసేసుకుంటున్నారన్నారు. అంతేకాకుండా లేనిపోని సాకులు చెప్పి పథకాలను ప్రజలకు అందనీయకుండా చేస్తున్నారన్నారు. రాబోయే కాలంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కర్రి వెంకటరెడ్డి (కృష్ణ) , నల్లమిల్లి సత్యన్నారాయణ రెడ్డి, లొల్ల ఎంపీటీసీ వైట్ల సతీష్, వాదా ప్రసాదరావు (టి ఎన్ టి యు సి స్టేట్ అధికార ప్రతినిధి, తెలుగు యువత అమలాపురం యువ అధ్యక్షులు కొవ్వూరి ఆదిరెడ్డి, మేడపాటి రవీంద్రరెడ్డి, రాయవరం వార్డు మెంబర్ మల్లిపాల గోవిందు, నూలు సత్యన్నారాయణ ,నేతల సురేష్ అధిక సంఖ్యలో రాయవరం మండలంలోని అన్ని గ్రామాల టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.