Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రభుత్వ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

:ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి శ్రద్ధాతో ఉండాలని

గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ తేతల సుబ్బిరామిరెడ్డి పేర్కొన్నారు.
మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ డి.వీ.వి నాగేశ్వరావు రెడ్డి ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మాజీ సర్పంచ్ పాలింగి చిన్నబాబు మాట్లాడుతూ ఆనాడు ఎందరో మహనీయుల త్యాగఫలం నేటి మన స్వాతంత్రం అని గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి శ్రద్ధాతో ఉండాలని, ముఖ్యంగా విద్యార్థి దశనుంచి స్వాతంత్ర పోరాటాల గురించి తెలుసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మాజీ సర్పంచ్ పాలింగి చిన్నబాబు, యోగా మాస్టర్ వెలగల ఫణికృష్ణారెడ్డి, టీడీపీ యువనాయకులు బక్కి సందీప్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బహుమతులను విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో చింతా పాండురంగారెడ్డి, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పులగం శ్రీనివాసరెడ్డి, వార్డ్ మెంబర్ తాడి రామచంద్రరెడ్డి, పడాల కమలారెడ్డి, తెంటు సత్యనారాయణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement