విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
చంద్ర యాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు జై కొడుతూ.. భారత దేశ కీర్తిని చాటుతూ.. విద్యార్థులు గురువారం భారీ ప్రదర్శనలు చేశారు. ఈ క్రమంలో మండలంలోని వెదురుపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు ఇస్రో ఇంగ్లీష్ అక్షరాల రూపంలో ఒదిగిపోయి అభినందనలు తెలియజేశారు. పాఠశాల హెచ్ఎం పి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. జయహో ఇస్రో జయహెూ భారత్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ప్రపంచ దేశాలు నేటి వరకు మిషన్ విజయవంతం చేయలేకపోయారని, భారత శాస్త్రవేత్తలు అంతరిక్ష నౌకను చంద్రుని దక్షిణ ధ్రువం పై దింపి, వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారని హర్షం వ్యక్తం చేశారు.