Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఆత్మగౌరం కోసం ఉద్భవించిన దండోరా…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆత్మగౌరం కోసం ఉద్భవించిన దండోరా…
ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

దళితుల ఆత్మగౌరహక్కుల కోసం ఉద్భవించేదే దండోరా ఉద్యమం అని ఎమ్మార్పీఎస్ ( మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం దళితువాడలో ఆదివారం మందకృష్ణ మాదిగ 60 జన్మదిన, ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జిల్లా కమిటీ సభ్యులు లంక చందు మాదిగ ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ మాదిగ పెద్దలు మందపల్లి నాగేశ్వరరావు, చంద్రమళ్ళ యాకోబు, మందపల్లి కొండలరావు, కందుకూరి గంగరాజు, చంద్రమళ్ళ సామ్యూల్ రాజు, దాసు, రమణ తదితరులు దళితివాడలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
తోలితగా వారు ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జిల్లా, మండల, గ్రామ కమిటీలు, పెద్దల ఆధ్వర్యంలో దళితవాడ నుండి మండల కార్యాలయ ప్రాంగణం లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా కవాతు నిర్వహించారు. ఈ కవాతుకు బేడ బుడగ జంగం కుల పెద్దలు, యువకులు మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటరానితనం, అసమానతులు రూపుమాపుటకు ఆత్మగౌరహక్కులను నినదీస్తూ దండోరా ఉద్యమం ఏర్పాటయింది అన్నారు. దళితుల్లోని 59 ఉప కులాల ప్రజల హక్కుల కోసం ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం చేపట్టి నేటికీ 30 సంవత్సరాలు పూర్తి చేస్తుందన్నారు. ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవాలంటేనే సిగ్గుపడే రోజుల నుంచి నేటి సమాజంలో మాదిగ కులం అనే గర్వంగా చెప్పుకునే స్థాయికి రావడం వెనుక మందకృష్ణ మాదిగకు అనేక కన్నీటి దారులు దాగి ఉన్నాయని అన్నారు. ఒక కులానికే ఎమ్మార్పీఎస్ పరిమితం కాకుండా వృద్ధులు, వితంతువుల, దివ్యాంగుల, చిన్నారుల సమస్యలపై ఉద్యమించిన ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగని కొనియాడారు. అనంతరం మండల కార్యాలయ ఆవరణంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ లకు ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు చంద్రమళ్ళ సంజయ్ రాజు, దువ్వ చంద్రశేఖర్, చంద్రమళ్ళ రాజు, చంద్రమళ్ళ సునీల్ గ్రామ కమిటీ సభ్యులు ఇండుగమిల్లి అరుణ్ కుమార్, గొట్టుముక్కల రాజు, చంద్రమళ్ళ భరత్, మందపల్లి శేఖర్, గొర్త విజయ్ కుమార్, పలివెల సుధీర్, డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement