Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకో..ప్రజా సంక్షేమం వైపు చూడు ముఖ్యమంత్రి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట:

గోకవరం మండలం కొత్తపల్లి గ్రామం నుండి గోకవరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి పెరిగిన ఆర్టీసీ చార్జీలు పై ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అనంతరం బస్సులో ప్రయాణికులతో ఎక్కడినుండి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు మీకు ఎంత చార్జీ పెరిగింది. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో గోకవరం బస్ డిపో చేరుకుని అక్కడ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్న బస్సు లలో ప్రయాణికుల వద్దకు వెళ్లి బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సామాన్య ప్రజలపై సెజ్ పేరుతో ఆర్టీసీ చార్జీలు పెంచి 5 రూపాయల ఉన్న మినిమం ఛార్జి ₹10 పెంచడం జరిగిందని 30 రూపాయలు చార్జీ 40 రూపాయలు పెంచడం 40 రూపాయలు చార్జీ 60 రూపాయలు పెంచడం ఇలా ఆర్టీసీ చార్జీలు కూడా బాదుడే బాదుడు చేసి ఎనిమిది వేల కోట్ల రూపాయలు సామాన్యులపై భారం వేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు మాట్లాడుతూ అడ్డతీగల నుండి రాజమండ్రి వెళ్లేందుకు ఛార్జ్ డబ్బులు తెచ్చుకున్నానని కానీ పెరిగిన చార్జీల వల్ల వెళ్ళుటకు సరిపోతాయి కానీ రావడానికి డబ్బులు చాలడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ చార్జీలు వస్తువుల ధరలు పెంచి నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలు నట్టేట ముంచారని ఆయన ఎద్దేవా చేశారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను అని చెప్పారు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు .వినియోగదారుడికి కానీ ఉత్పత్తిదారులు కానీ ఏమైనా ఉపయోగం ఉందా ధరల స్థిరీకరణ నిధి వల్ల అని ఆయన ప్రశ్నించారు. ఈ మూడు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారని పోలవరం నిర్వీర్యం చేసిన ఘనత నీదే నని ఆయన ప్రభుత్వంపైౠ విమర్శలు గుప్పించారు. సామాన్యులు ప్రజలపై భారం పడకుండా కార్యక్రమాలు చేసి సామాన్య లను పరిరక్షించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోకవరం జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి మండలాల టిడిపి అధ్యక్షులు మంగ రౌతు రామకృష్ణ మారిశెట్టి భద్రం పోతుల మోహన రావు, చదరంచంటి బాబు, అడప భరత్ కుమార్, పాలూరి బోసు బాబు, ఉంగరాల రాము, బత్తుల సత్తిబాబు, గుణిపే భరత్, దొడ్డ విజయ్, ఈది అశోక్, పోసిన ప్రసాద్,ఆకులకాశి, ఉంగరాల గణేష్, అచ్చన్న దొర, ఈడుదల అర్జునరావు, కోట సూరి బాబు, బాలాజీ, గంగాధర్, బాబి, సిరి, వెంకటపతి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement