విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ సిటీ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 73వ జన్మదినం సందర్భంగా స్థానిక సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, వనమాడి కొండబాబు పేరాబత్తుల రాజశేఖర్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి చీకటి రోజులు పోవాలంటే చంద్రబాబు రావాలి అనే నినాదంతో ఉన్న భారీ కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం జనరల్ హాస్పిటల్ న౦దు పేషెంట్లకు పళ్ళు, బ్రెడ్లు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల నవీన్లు మాట్లాడుతూ రేపటి తరానికి ఆశాజ్యోతి చంద్రబాబు అని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికతో విజన్తో ఉమ్మడి రాష్ర్టాలను చంద్రబాబు అభివృద్ధి చేశారని, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, చాపల ప్రశాంతి, తుమ్మల సునీత, చిక్కాల సత్యవతి, కొల్లాబత్తుల అప్పారావు, బోళ్ల క్రిష్ణ మోహన్, ఎం ఎ. ఖాన్, పలివెల రవి, బంగారు సూర్యావతి, గుజ్జు దుర్గ, అంబటి క్రాంతి, కొల్లు కుమారి, రికా లక్ష్మి, పిర్రల లక్ష్మీప్రసన్న, దేవు జయలక్ష్మి, ఆయేషా, కొప్పనాతి నాగకుమారి, మూగు చిన్ని, వడిసెల దాలమ్మ, ఎండి జిలాని, వొమ్మి బాలాజి, గుజ్జు బాబు, ఎండీ ఆన్సర్, ఎస్కె రహీమ్, అసిఫ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.