-పారిశుద్ధ్య పనులు ఆకస్మిక తనిఖీ
-నగశ్రపాలక సంస్థ కస్మిషనర్ నాగ నరసింహారావు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
షాపుల్లోని చెత్తను నిర్లక్ష్యంగా రోడ్డుపై వేయడంపై కమిషనర్ సిహెచ్.నాగ నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. రోడ్డుపై వేసిన చెత్తను…. వాళ్ల మనుషులతోనే తొలగింపచేసి రూ.1000 జరిమానా విధించారు.పారిశుద్ధ్య పనుల తనిఖీల్లో భాగంగా కమిషనర్ నాగ నరసింహారావు 14వ సర్కిల్ పరిధిలోని సర్పవరం, గైగోలుపాడు ప్రాంతాల్లో పర్యటించారు. సర్పవరం జంక్షన్ లోని విశాఖ డైరీ పార్లర్ వద్ద ఆషాపుకు సంబంధించిన చెత్తను,వ్యర్ధాలను అక్కడే రోడ్డుపై వేయడాన్ని గుర్తించారు.ఆచెత్తను షాప్ నిర్వాహకుల ద్వారానే తొలగింప చేసి రూ.1000 జరిమానా కూడా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చెత్తను రోడ్ల పక్కన, డ్రైన్ల లోను, ఖాళీ స్థలాలలోను వేయవద్దని పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక స్మార్ట్ సిటీ మరింత సుందరంగా తయారవ్వాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమన్నారు. ప్రజలు సహకరించినప్పుడే మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమన్నారు. పర్యటనలో భాగంగా సర్పవరం వద్ద ఉన్న టాయిలెట్స్ లోని మూత్రశాల స్తంభించిన విషయాన్ని గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.