విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
ప్రపంచంలో 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మాత్రమే అని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలిపారు. శుక్రవారం స్ధానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలు నుండి ధనవంతుడు వరకు సభ్యులు తమ పార్టీలో ఉన్నారన్నారు.అలాగే సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చి, బాలయోగి , ప్రతిభా భారతి వంటి వారిని లోక్సభ స్పీకరు , అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత టీడీపీది మాత్రమే అని గుర్తు చేశారు.గురువారం ప్రారంభించిన సభ్యత నమోదు కార్యక్రమంలో తొలి పది నిమిషాలలో సెకనుకు ఎనిమిది వేసి మంది పేర్లు నమోదు చేసుకున్నారని నవీన్ తెలిపారు .గతంలో సభ్యత్వ రుసుము వంద రూపాయలు వసూలు చేసి, దాని ద్వారా ప్రమాద భీమా ఏర్పాటు చేయడం ద్వారా సుమారు నాలుగు వేల కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. కార్యకర్తను కుటుంబ సభ్యునిగా గుర్తించే పార్టీ టీడీపీ మాత్రమే అని నవీన్ తెలిపారు. అలాగే యన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద కార్యకర్తలకు విద్య అందించడం జరుగుతోంది అని తెలిపారు. తమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు తిరిగి అధికారం సాధించడం ఖాయమని, దానికి ఈ సభ్యత్వ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని నవీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పేరాబత్తుల రాజశేఖర్, జహీరుద్దీన్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.