Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మహిళలకు సున్నా వడ్డి రుణాలు నేరుగా మహిళల ఖాతాల్లోకి..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– జిల్లాకలెక్టర్ కె. మాధవీలత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః

నవరత్నలలో భాగంగా మహిళలు ఆర్థిక సాధికారత సాధించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది కూడా సున్న వడ్డీ రాయితీ ని 40,178 ఎస్ హెచ్ జి లకు రూ.45.51 కోట్లను అక్క చెళ్ళమ్మల బ్యాంకు ఖాతాల కి జమ చెయ్యడం జరిగిందని జిల్లాకలెక్టర్ కే. మాధవీలత, సంయుక్త తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు పేర్కొన్నారు.
శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు లో 3వ విడత సున్న వడ్డీ బహిరగసభకి వర్చువల్ ద్వారా మునిసిపల్ ఆఫీస్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా వరుసగా 3వ ఏడాది అందచేస్తున్న వై ఎస్ ఆర్ సున్నా వడ్డి గ్రామీణ ,అర్బన్ లో అర్హత పొందిన 40,178 స్వయం సహాయక సంఘలకి మొత్తం రూ.45.51 కోట్లు సున్నా వడ్డీ రాయితి బ్యాంకు ఖాతాలకి జమ చెయ్యడం జరిగిందన్నారు. మహిళలు స్వయం సహాయక సంఘాలు ద్వారా తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా చెల్లించి, సున్న వడ్డీ ప్రయోజనం పొందాలన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ వి. వేణుగోపాల్ రావు మాట్లాడుతూ, మహిళా సాధికారత సాధించే దిశగా అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరిట అందిస్తూన్నా మన్నారు. గతంలో రాష్ట్రంలో 80 లక్షల మంది మహిళా సభ్యులు ఉంటే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నమ్మకంతో ఈరోజు కోటి రెండు లక్షలకు పెరగడమే నిదర్శనం అన్నారు. జిల్లా లో డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతం లో ఉన్న 33498 స్వయం సహాయక సంఘలకి మొత్తం రూ..37.27 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతం లో ఉన్న 6,680 స్వయం సహాయక సంఘలకి మొత్తం రూ.8.24 కోట్లు మేర జమ చేశామన్నారు. నియోజకవర్గం వారీగా బిక్కవోలు 4682 గ్రూపులకు రూ.3.58 కోట్లు, గోపాలాపురం 5799 గ్రూపులకు రూ.8.64 కోట్లు, జంగారెడ్డిగూడెం 1865 గ్రూపులకు రూ.1.07 కోట్లు, కొవ్వూరు 4596 గ్రూపులకు రూ.6.68 కోట్లు, నిడదవోలు 4, 992 గ్రూపులకు రూ. 8.94 కోట్లు, రాజమహేంద్రవరం (రూరల్ ) 5, 510 గ్రూపులకు రూ. 3.66 కోట్లు, రాజానగరం 6,054 గ్రూపులకు రూ.4.70 కోట్లు ప్రయోజనం పొందారు. మెప్మా ద్వారా రాజమహేంద్రవరం (అర్బన్ ) లోని 5484 గ్రూపులకు రూ.6.56 కోట్లు, కొవ్వూరు లోని 563 గ్రూపులకు రూ. 81 లక్షలు , నిడదవోలు లోని 633 గ్రూపులకు రూ. 87 లక్షలు మేర సున్నా వడ్డీ రాయితి లను వారిఖాతా లో జమచేశారు. *సిఎం కి కృతజ్ఞతలు తెలిపిన డ్వాక్రా చెల్లెమ్మలు …*
జగనన్న మహిళా పక్ష పాతి అని, కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సున్న వడ్డీ రాయతీ ని అమలు చేసి, కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందు లేకుండా అండగా నిలిచారని జీ. లక్ష్మి, వీ. సుబ్బలక్ష్మి లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభత్వానికి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి , స్థానిక నాయకులు చందన నాగేశ్వర్, పొదుపు సంఘాల మహిళలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement