Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నన్నయ అభివృద్దికి కృషి చేద్దాం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

-ఫౌండేషన్ డే లో రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని, వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు నాయకత్వంలో విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధిని సాధిస్తుందని రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్ అన్నారు. యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం యూనివర్సిటీ ఫౌండేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదికవి నన్నయ విగ్రహానికి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, స్వర్గీయ జక్కంపూడి రామ్మోహనరావు చిత్రపటాలకు విశ్వవిద్యాలయ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల కృషి ఫలితంగా 2006వ సంవత్సరంలో ప్రారంభమైన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి, జక్కంపూడి రామ్మోహనరావు, గోదావరి విశ్వవిద్యాలయ సాధన సమితి సభ్యుల కృషికి నిదర్శనం నన్నయ విశ్వవిద్యాలయమన్నారు. విశ్వవిద్యాలయానికి ఉపకులపతులుగా ఆచార్య నిరూపరాణి, ఆచార్య జార్జ్ విక్టర్, ఆచార్య ఎం.ముత్యాలు నాయుడు తో పాటు కొందరు ఇన్చార్జ్ వీసీ గా పని చేసారని, ప్రస్తుత వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావులు సేవలందిస్తున్నారని చెప్పారు. 16 సంవత్సరాల విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ప్రతీ సిబ్బంది పాత్ర కీలకమైనదని తెలిపారు. ప్రస్తుత ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు విశ్వవిద్యాలయానికి అవసరమైన అన్ని గుర్తింపులు తీసుకువచ్చారని కొనియాడారు. కొవిడ్ సంక్షోభంలో పరీక్షల నిర్వహణ, వందకు పైగా వెబినార్స్ నిర్వహణ, ఆసియ, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఐ.ఎస్.ఓ, ఎ.ఐ.సి.టి.ఇ. గుర్తింపులను తీసుకువచ్చారని చెప్పారు. క్రీడాభివృద్ధికి నిధులు, సైకలాజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్, నన్నయవాణి, నన్నయభారతి, నన్నయ విజ్ఞాన కేంద్రం, జెస్టోర్, జెగేట్, స్టూడెంట్ క్లబ్స్, భవన నిర్మాణాలు ఇలా అన్ని కోణాలలో ప్రగతిని సాధించామన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి నాక్ గుర్తింపు ఎంతో అవసరమని భావించి నాక్ సాధనకు కృషి చేస్తున్నారని ఇటీవల నాక్ ఎస్.ఎస్.ఆర్ ను సమర్పించామని చెప్పారు. విశ్వవిద్యాలయం భవిష్యత్ లో మరిన్ని విజయాలను చూడబోతుందని తెలయజేసారు. మనమంతా సమష్టిగా పని చేసి విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంస్థ ప్రయోజనాలు ముఖ్యమని గుర్తు చేసారు. ఓ.ఎస్.డి. ఆచార్య ఎస్.టేకి మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆయా ఉపకులపతుల కాలంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. కోవిడ్ కాలంలో ఆచార్య మొక్కా జగన్నాథరావు లాంటి ఉపకులపతి విశ్వవిద్యాలయానికి వీసీ గా రావడం మనందరి అదృష్టమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు డా.కె.రమణేశ్వరి, ఆచార్య పి.సురేష్ వర్మ, డా.పి.వెంకటేశ్వరరావు, డా.పి.విజయనిర్మల, డా.డి.జ్యోతిర్మయి, డా.బి.కెజియారాణి, డా.కె.నూకరత్నం, ఎస్.లింగారెడ్డి, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

రైటప్: నన్నయ, వై.ఎస్.ఆర్, జక్కంపూడి లకు నివాళులర్పిస్తున్న అధికారులు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement