Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గెలిచే పార్టీతోనే తోటత్రిమూత్రులు బాట.. వేగుళ్ల మాట

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

"ఆయనెప్పుడు ప్రతి పక్షములో వుండరు. ఏ పార్టీ
అధికారంలో ఉంటే ఆ పార్టీ లో చేరిపోవడమే.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
ఆయనది రేవు దాటాక తెప్ప తగలేసే నైజం. ఆయనెప్పుడు ప్రతి పక్షంలో వుండరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లో చేరిపోవడమే. రేపు మా భయం కూడా ఇదే. ఎక్కడ వచ్చి మాతో కలిసిపోతాడో అని. ఎందుకంటే 2024 లో వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమే. మేం గెలవడం ఖాయం . ఆయన తెలుగుదేశం పార్టీ లోకి రావడమూ ఖాయం అంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఉద్దేశించి సెటైర్లు వేశారు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. మండపేట టౌన్ హాల్ వద్ద నిర్వహించిన గౌరవ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

ముఖ్యంగా 2024 లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వకుండా దొంగ దెబ్బ తీసారన్నారు. మండపేట నియోజకవర్గాన్ని అన్యాయంగా కోనసీమ లో విలీనం చేశారన్నారు. పింఛన్లు 2022 నాటికి 3000 కు పెంచుకుంటూ పోతామని చెప్పి ప్రస్తుతం 2500 మాత్రమే ఇస్తున్నారన్నారు. టిడ్కో ఇల్లు అందివ్వకుండా ప్రజలను ఎడిపిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందన్నారు. ముఖ్యంగా తాపేశ్వరం లో ఓ మహిళా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయాన్ని న్యూస్ లో చూశానన్నారు. మూడేళ్ళ క్రితమే ఆ రోడ్డు నిర్మాణానికి చంద్రబాబు 10 కోట్లు మంజూరు చేస్తే ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా ఆ పనులను రద్దు చేసిందన్నారు. చంద్రన్న భీమా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోపా, క్రిస్మస్ కానుక, వ్యవసాయ పని ముట్ల పరికరాల పంపిణీ వంటి పధకాలన్నింటినీ సమూలంగా ఆటకెక్కించిన ఘనుడు జగన్ మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు.
ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని అంద పాతాళానికి నెట్టేసాడన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్ లు మంజూరు చేస్తే ఎదో సాధిస్తాడాని తాను బ్రమ పడ్డానని కానీ సొంత కార్యకర్తలకు పదవులు ఇచ్చి జీతాలు ఖర్చు పెట్టడానికి తప్పా కార్పొరేషన్ లతో ప్రజలకు దమ్మిడీ ఉపయోగం లేకుండా పోయిందన్నారు. కపిలేశ్వరపురం ఇసుక ర్యాంపుల్లో 15కోట్ల రూపాయలకు లెక్కలు లేకుండా పోయిందన్నారు. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పమంటే వైసీపీ నాయకులు నోరు మెదపడం లేదన్నారు. ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీలో చేరిపోయి అంతకుముందు పార్టీని బండ బూతులు తిట్టడం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు అలవాటని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి లపై త్రిమూర్తులు నోరు పారేసుకున్న వీడియోలను సభలో ప్లే చేసి చూపించారు. ఇదీ ఆయన నైజమంటూ త్వరలో మా టీడీపీ లోకి చేరిపోతారని భయంగా ఉందంటూ చురకలు అంటించారు. మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ మాట్లాడుతూ మండపేట లో ఎప్పుడూ లేని విధంగా కుల రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మండపేట చరిత్రలో కులాల ప్రాతిపదికన పాలన సాగించిన చరిత్ర ఎప్పుడూ లేదని, అన్ని వర్గాల సంక్షేమమే ద్యేయంగా తెలుగుదేశం పార్టీ పని చేయడం జరిగిందని పేర్కొన్నారు. నేడు మండపేట లో శానిటేషన్ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. అభివృద్ధి ఎక్కడా కానరావడం లేదన్నారు. గడిచిన మూడేళ్ళలో తూతూ మంత్రపు అభివృద్ధి తప్పా తాము చేసినట్లు ఎక్కడా చేయలేకపోయారని విమర్శించారు. తాము 5 శాతం పనులు మిగిల్చి ఇచ్చిన టిడ్కో ఇళ్లను నేటికీ వైసీపీ నాయకులు అందివ్వలేకపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అదీ ఇదీ అని కాకుండా అన్నింటా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఈ వైఫల్యాలను పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. 2024 లో టీడీపీ విజయమే ఏకైక అజెండాగా కేడర్ అంతా కష్టించి పని చేయాలని ప్రకాష్ పిలుపునిచ్చారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సభ్యత్వ నమోదుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement