విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్) :మండలం పరిధిలో మడికి గ్రామానికి చెందిన సలాది శ్రీనివాసు ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఈదల రమేష్ కుమార్, మల్యాల రాజేష్, పెనుమాక సూరిబాబు, అడ్డాల సత్యనారాయణ రాజు, కొత్తపల్లి కృష్ణ, చెల్లబోయిన సింహాచలం, వాసంశెట్టి దుర్గారావు, యూ గిరీష్, యూ సామ్యూల్ రాజు, మామిడిశెట్టి వెంకట రమణరావు పలువురు పాల్గొన్నారు.