Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో వైద్య సేవలు మెరుగుపరచాలి

-వైద్య ఆరోగ్యశాఖ ఫ్యామిలీ వెల్పేర్ కమిషనర్, మషన్
డైరెక్టర్ ఎన్. హెచ్.ఎం. జె.నివాస్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం, విశ్వం వాయిస్ః

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్య సేవలు మెరుగుపరిచి రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించి స్వస్థత చేకూర్చాలని వైద్య ఆరోగ్య శాఖ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, మిషన్ డైరెక్టర్ ఎన్.హెచ్.ఎం. జె. నివాస్ పేర్కొన్నారు. శనివారం ఆయన అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ వివిధ జిల్లాల వైద్య సేవల సమన్వయ అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారులతో నిర్వహించి ఫీవర్ సర్వే, ఆసుపత్రి ప్రసవాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు పి.హెచ్.సి ల వారీగా వైద్యసేవలలో పురోగతి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వర పీడితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ తదనుగుణంగా మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించి ఆరోగ్య ఆసరా ద్వారా సాధారణ ప్రసవానికి రూ. 5000 ప్రోత్సాహక నగదు అందించి ఆసుపత్రి ప్రసవాల పట్ల గర్భిణీలలో ఒక భరోసా ను తీసుకొని రావాలని ఆయన సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తప్పనిసరిగా ఇద్దరు వైద్యులు ఉండాలని ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బయోమెట్రిక్ హాజరు వేసి సమయపాలన పాటించేలా ఉన్నతాధికారులు శ్రద్ధ వహించాలన్నారు. వివిధ అనారోగ్యాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తూ వైద్య సేవల పట్ల భరోసాగా నిలవాలని ఆయన సూచించారు. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను సమర్థవంతంగా వినియోగించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది అంకితభావం జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు నిర్వహణ జరగాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ప్రసవానికి సంబంధించి ముందస్తు డెలివరీ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పన తో పాటు అవసరమైన రిపేర్లు అందుబాటులో నిధులతో చేపట్టి రోగులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆసుపత్రులను కార్పొరేట్ దీటుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. గర్భం దాల్చిన నాటి నుండి గర్భిణీలను ఆసుపత్రి ప్రసవాలు నిర్వహించుకునేలా చైతన్యం తీసుకుని వస్తూ సుఖ ప్రసవాలు నిర్వహించాలన్నారు. ఆసుపత్రులలో విద్యుత్ సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే మరుగుదొడ్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా రన్నింగ్ వాటర్ తో ఉండేలా జాగ్రత్తలు వహించాలన్నారు. ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్షలు ఉంటాయని అందుకు జిల్లాస్థాయి అధికారులు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తరచుగా తనిఖీలు నిర్వహించి వైద్య సేవలలోని గ్యాపు లను గుర్తించి వాటిని పూరించి వైద్య సేవలను మెరుగుపర్చాల్సిన బాధ్యత జిల్లా స్థాయి అధికారులపై ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేసుకుని సమయపాలన పాటించాలన్నారు. వైద్య విధాన పరిషత్ వైద్య సేవల పట్ల మరింత ఫోకస్ ను పెట్టాలని సూచించారు. ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో సిబ్బంది కొరత ఏ ఏ క్యాడర్ లలో ఎంతమంది ఉన్నారో తమకు తెలియజేస్తే భర్తీ కీ తగు చర్యలు చేపడతామన్నారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు తప్పనిసరిగా ఉండాలని మిగిలిన డాక్టర్లను స్థానికంగా ఉన్న అవసరాలకు నియమిoచుకోవాలని ఆయన సూచించారు. స్థానిక డి సి హెచ్ ఎస్. ఎన్. పి. పద్మ, రాణి స్థానిక కలెక్టరేట్ నుంచి పాల్గొని మాట్లాడుతూ పి.హెచ్.సి ల వారీగా వైద్య సేవలను బలోపేతం చేయడం ప్రారంభించామని ఆశించిన స్థాయిలో పురోగతి సాధించేందుకు సమాయత్తం అవుతున్నట్లు ఆమె వెల్లడించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ పక్కాగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నారుల ఇమ్యునైజేషన్ షెడ్యూల్ నవజాత శిశువుల ఇమ్యునైజేషన్ షెడ్యూల్, చిన్నారులలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు టీకాలు నిర్దేశిత కాల వ్యవధిలో అమలు చేసేందుకు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భరత్ లక్ష్మి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా అన్ని రకాల వైద్య సేవలను రోగులకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎం వో. ఎన్ వెంకటేశ్వరరావు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement