Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

లక్షలో దంత వైద్య శిబిరం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

కాకినాడ, విశ్వం వాయిస్ః

లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం పాఠశాల విద్యార్థినివిద్యార్థులకు ” దంత వైద్య పరీక్షలు ” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జి.ఎస్.ఎల్ హాస్పటిల్ దంత వైద్యనిపుణులైన డాక్టర్. విజయ్, డాక్టర్. జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్య ఇంటర్ నేషనల్ పాఠశాల డైరక్టర్ డా. ఎన్. సుగుణా రెడ్డి మాట్లాడుతూ ప్రతీ వ్యక్తికి చక్కటి ఆరోగ్యం కలగడానికి దంతాలు ప్రాధాన్యత చాలా ఉందని , ప్రతీ ఒక్కరు తమ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని , ప్రతీరోజు ఉదయం , సాయంత్రం క్రమంతప్పకుండా దంతాలను శుభ్రపరుచుకోవాలని ఆమె తెలిపారు. తరువాత పాఠశాల పిన్సిపాల్ విద్యాశంకర్ మాట్లాడుతూ నేటి కాలంలో చాలా మంది దంత సమస్యలతో బాధపడుతున్నారని దంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం కారణమన్నారు. చిన్న వయస్సు నుండే విద్యార్థిని , విద్యార్థులు తమ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె తెలిపారు. డాక్టర్ . విజయ్ , డాక్టర్.జ్యోతి విద్యార్థినీ , విద్యార్థులకు పాఠశాల డైరక్టర్ డా.ఎన్ . సుగుణారెడ్డి , ప్రిన్సిపాల్ విద్యాశంకర్ సమక్షంలో దంత పరీక్షలు నిర్వహించి , దంతాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో మరియు వాటిని పరిరక్షించుకోవడానికి , ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చక్కగా వివరించారు.విద్యార్థిని , విద్యార్థుల తల్లిదండ్రులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం వల్ల తమ పిల్లలకు నోటి శుభ్రత , దంతాల ప్రాధాన్యతపై సరియైన అవగాహన కలిగి , దంత పరిరక్షణకు తగిన రక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుందని హర్షం వ్యక్తం చేసారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement