మరియు ప్రజాసంఘాలు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
ఏప్రిల్ 25న యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అమరావతిలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిలో భాగంగా జరిగే పోరుగర్జన యాత్రకు వెళ్లకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు అక్రమ గృహ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ యుటిఎఫ్ మరియు ప్రజాసంఘాల ఆద్వర్యంలోఆదివారం నిరసన ప్రదర్శన జరిగింది ఈ నిరసన ప్రదర్శన పోలీసులు అడ్డుకుని ఐ వి తో సహా యుటిఎఫ్ ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసి అమలాపురం అంబాజీపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.మొదట ఐవి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపేందుకు సిద్ధమైన యూ.టి.ఎఫ్ మరియు ప్రజా సంఘాల కార్యకర్తలు ఐవి ఇంటికి తరలివచ్చారు అక్కడ నుండి ప్రదర్శనగా గడియార స్తంభం సెంటర్ వరకు చేరుకున్నారు దారిపొడవునా పోలీసులు ఈ ప్రదర్శన అడ్డుకునే ప్రయత్నం చేశారు. మధ్యలో యూటీఎఫ్ ప్రజాసంఘాల నాయకత్వాన్ని అరెస్టు చేశారు ఒక సమయంలో పోలీసులకు యుటిఎఫ్ ప్రజాసంఘాల కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం స్థానిక గడియారం స్తంభం సెంటర్ వద్ద రోడ్డు పై ఐవి పడుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారుఈసందర్బంగా ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలపై నిర్బంధం జగన్ ప్రభుత్వానికి తగదని సిపిఎస్ ను వారంరోజుల్లో రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ మాట చెప్పి మడుగు తిప్పాడని ఎద్దేవా చేశారు అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఈకార్యక్రమంలో యూటిఎఫ్ సీనియర్ నాయకులు కె.సత్యనారాయణ, ఆర్.రామారావు, పి.భాస్కరరావు, జిల్లా నాయకులు పెంకే వెంకటేశ్వరరావు, ఎన్. విశ్వనాధ్, కె.సురేష్ కుమార్, మామిడిశెట్టి వేంకటేశ్వర రావు, బి.చంద్రకళ, బి.ఎన్. శివకుమార్, బి.రాఘవమ్మ, కె.ఎన్.వి.సత్యనారాయణ, పి.ఏడుకొండలు, జి.సూర్యచంద్రరావు, జి.సుబ్రహ్మణ్యం, పి.వి.విశ్వప్రసాద్, డి.దుర్గారావు. టి దుర్గాప్రసాద్ కె రాజుబాబు అబ్దుల్ సత్తార్ ప్రజాసంఘాల నాయకులు వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ పి వసంతకుమార్ విసికే పార్టీ జిల్లా అద్యక్షలు బొంతు రమణ ఐద్వా నాయకురాలు టి నాగవరలక్ష్మి తదితరులు పాల్గోన్నారు