Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కట్రావులపల్లి చోరీ కేసును ఛేదించిన పోలీసులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కాట్రావులపల్లి చోరీ కేసును చేధించిన పోలీసులు
ఇద్దరు వ్యక్తులు అరెస్ట్, చోరీ సొత్తు రికవరి
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పెద్దాపురం
అడిషనల్ ఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట:

 

జగ్గంపేట:విశ్వం వాయిస్ న్యూస్

ఈనెల 22వ తేదీన రాత్రి జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి ఐరన్ షాప్ లో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై షాపు యజమాని 23వ తేదీ ఉదయం జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన జగ్గంపేట పోలీసులు సీసీ పుటేజ్, క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేసి కేసును ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం జగ్గంపేట సి ఐ బి.సూరి అప్పారావు ఆధ్వర్యంలో స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశానికి పెద్దాపురం అడిషనల్ ఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాట్రావులపల్లి ఐరన్ షాపులో చోరీ జరిగిన ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐ పీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దాపురం డి.ఎస్.పి అరిటాకుల శ్రీనివాసరావు పర్యవేక్షణలో జగ్గంపేట సి ఐ బి. సూర్య అప్పారావు సిబ్బందితో దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు.
ఈనెల 27వ తేదీ ఉదయం గోకవరం రోడ్డు లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పోలవరం కాలువ దగ్గరలో పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించగా ఏపీ 39 జెఏ 1179 షిఫ్ట్ కారు లో ఒకరు, దాని వెనుక మరో వ్యక్తి ఏపీ జీరో ఫైవ్ ఈ ఎస్ 0637 బజాజ్ పల్సర్ వారిద్దరూ పోలీసులను చూసి అనుమానంగా తారసపడడంతో డి.లాజరు, వీర దుర్గాప్రసాద్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ ఈ పాల్పడినట్లు ముద్దాయిలు తెలియజేయడం జరిగిందని డిఎస్పీ తెలిపారు. ఈ కేసులో వారి వద్ద నుంచి చోరీకి గురైన షిఫ్ట్ డిజైర్ కారు, 45 వేల రూపాయల నగదు, హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్, లాప్టాప్,రెండు సెల్ ఫోన్లతో పాటు గండేపల్లి స్టేషన్ పరిధిలో చోరీకి గురైన బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ ను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.ఈ కేసులో అరెస్టు కాబడిన ముద్దాయిలు గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దివాలా లాజరు (17), రాయి వీర దుర్గా ప్రసాద్ (21)లు పాత నేరస్తులని, వీరిపై గతంలో పెద్దాపురం, సామర్లకోట,ఇంద్రపాలెం, కాకినాడ, బొమ్మూరు,రాజమండ్రి, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 15 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో విశేష శ్రద్ధ చూపించిన జగ్గంపేట సి ఐ సూర్య అప్పారావు, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో జగ్గంపేట సీఐ బి.సూర్య అప్పారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement