Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

“భగవంతుని సాక్షిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రమాణం చేయగలరా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట: గతంలో ఇసుక రాంప్ సిండికేట్ పై తన కల్యాణి రైస్ మిల్ లో సమావేశం నిర్వహించిన విషయం నిజమో కాదో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాలని రాష్ట్ర శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. మండపేట వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తోట పాల్గొని మాట్లాడారు.

సదరు సమావేశానికి తన ఆప్త మిత్రుడు రేవు శ్రీను హాజరు కావడంతో తనకీ విషయాలన్నీ తెలుసునన్నారు. ఆనాడు ఇసుక సిండికేట్ లతో కోట్ల రూపాయలు దండుకున్న వేగుళ్ల కు తమను విమర్శించే అర్హత లేదన్నారు. 15 కోట్లకు లెక్కలు చెప్పాలని పదే పదే అడుగుతున్నారని, తనకు సంబంధం లేని విషయాలపై తానేందుకు వివరణ ఇస్తానని తోట ప్రశ్నించారు. కోరుమిల్లిలో నిబంధనలు ప్రకారం ఇసుక తవ్వకాలు జరిగాయో లేదో అక్కడ తవ్వకాలు జరుపుతున్న జేపీ వెంచర్స్ వారు సమాధానం చెప్పాలి గాని తానెందుకు చెబుతానన్నారు. అసలు కోరుమిల్లిలో ఉదయం లారీలను సీజ్ చేయమని పిర్యాదు చేసిన వేగుళ్ల రాత్రికి రాత్రి వాటిని విడిచి పెట్టేయమని తహసీల్దార్ కు ఫోన్ ఎందుకు చేసారో సమాధానం చెప్పాలన్నారు. అదే రోజు జేపీ వెంచర్స్ ఉద్యోగి వేగుళ్ల ఇంటికి వెళ్లి బేరం కుదుర్చుకుంటేనే లారీలను వదిలేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. నిజం కాకపోతే ప్రమాణం చేసి ఈ విషయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేగుళ్ల చేసిన రియల్ ఎస్టేట్ భూములకు మట్టి ఎక్కడ నుండి రప్పించి చదును చేసారో వివరాలు చెప్పాలన్నారు. అందుకు సంబంధించిన మైనింగ్ రసీదులు ఉంటే చూపించాలన్నారు. తాను కాకమ్మ కబుర్లు చెబుతున్నానని వేగుళ్ల అంటున్నారని, అయితే 2015 లోనే టీడీపీ కి గెజిట్ లాంటి ఈనాడు పేపర్లలో వేగుళ్ల కోసం ఇసుకాసూరులు అంటూ వచ్చిన వార్తలను మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటిపై మాట్లాడేందుకు బహిరంగ చర్చకు తాను సిద్ధమని, తేదీ సమయం, స్థలం ఎక్కడో ఆయనే చెప్పాలని పేర్కొన్నారు. అలాగే తాను అవినీతి చేసి ఉంటే రుజువులు చూపాలని వేగుళ్ల అంటున్నారని, దేశంలో ఏ రాజకీయ నాయకుడైన డబ్బులు తీసుకోలేదనే చెబుతారు గాని తీసుకున్నట్లు ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఈ సారి రుజువులు కోసం తీసి పెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అదే విధంగా కోరుమిల్లి లో డ్వాక్రా మహిళలు తిరగబడి ర్యాంపులు తమకు ఇవ్వాలని ఆందోళన చేస్తే వారిపై పోలీస్ లతో లాఠీ ఛార్జ్ చేయించిన చరిత్ర మీది కాదా అంటూ దుయ్యబట్టారు. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో మహిళలను కోర్టుకు తీసుకువెళుతుంటే తానే స్వయంగా వచ్చి పోలీస్ లను అడ్డుకున్నానని తోట పేర్కొన్నారు. అదే విధంగా వేగుళ్ల తండ్రి, తాతయ్య లను ఉద్దేశించి తాను ఎక్కడా తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. వారి పట్ల తనకూ గౌరవ భావం ఉందన్నారు. అలాగే నియోజకవర్గంలో 84 కమ్యూనిటీ హాళ్లు కట్టించానని వేగుళ్ల అంటున్నారని, అసలు ఎలాంటి అనుమతులు లేకుండా శంఖుస్థాపనలు చేసిన శిలాఫలకాలను తాను చూపిస్తానని దీనికి వేగుళ్ల ఎం చెబుతారని ప్రశ్నించారు. అదే విధంగా చంద్రబాబు నిధులు మంజూరు చేస్తే జగన్ ఆపేసారని వేగుళ్ల ఆరోపిస్తున్నారని, నిధులు మంజూరు అయితే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టుకోవాలి గానీ జగన్ ఆపేసారంటూ తప్పుడు ప్రచారాలెందుకు అంటూ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అడ్డగోలుగా చేసిన శంఖుస్థాపనలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిజంగానే అనుమతులు వుండి ఉంటే వాటిని తీసుకువెళ్లి కోర్టు లో వేసి ఎందుకు పోరాటం చేయడం లేదన్నారు. ఈ సమావేశంలో మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్, పట్టణ వైసీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, మండపేట మండల పరిషత్ అధ్యక్షులు ఉండమాటి వాసు, ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, పలివేల సుధాకర్, పిల్లా వీరబాబు, సాధనాల శివ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement