విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ముమ్మిడివరం-విశ్వం వాయిస్ న్యూస్:
భారతీయ వారసత్వ బౌద్ధ సాంస్కృతికి నిలయమైన అదుర్రు బౌద్ధ క్షేత్రం నందు జరిగే 2566వ బుద్ధ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా,జిల్లా శాఖ కోరింది. నగర పంచాయతీ పరిధిలోని స్థానిక పొలమ్మ చెరువు గట్టు (మినీ ట్యాంక్ బండ్) పై బుద్ధవిహార్ నందు జిల్లా కార్యవర్గ సభ్యుడు శరత్ అధ్యక్షతన బుధవారం బిఎస్ఐ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలువురు బుద్ధిస్ట్ లు పాల్గొని ఎంతో చారిత్రాత్మక విశిష్టతను కలిగి ఉన్న అదుర్రు బౌద్ధ క్షేత్రం వద్ద మే 22న జరిగే 2655 బౌద్ధ ఉత్సవాలలో అధిక సంఖ్యలో బుద్ధిస్టులు, అంబేద్కరియులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అనంతరం ఉత్సవాల కర పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్టా వెంకట్రావు,పెనుమాల సుధీర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ఆశీర్వాదం, డి ఆంజనేయులు, డి.సూర్యనారాయణ, పెయ్యిల పరశురాముడు, నల్లా కొండలరావు, యలమంచిలి బాలరాజు,మట్టా సిద్ధార్థ గౌతమ్,కలకట రమణ,జనిపల్లి జనార్దన్,దాసరి సత్యనారాయణ, పివివి సత్యనారాయణ లతో పాటు పలువురు పాల్గొన్నారు.a