విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కొత్తపేట:
కొత్తపేట (విశ్వం వాయిస్ న్యూస్)
కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన మాజీ రాష్ట్ర వైఎస్ఆర్ సిపి మహిళా అధ్యక్షురాలు, సామాజిక సేవకురాలు కొల్లి నిర్మల కుమారి తిరిగి తన సొంత గూటికి. బుధవారం చేరారు. గతంలో వైఎస్సార్సీపీపై అలిగి రాజీనామా చేసిన ఆమె మరల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో మండల పరిధి చొప్పెల్లలో జరిగిన బహిరంగ సభలో తన అనుచరగణంతో వైఎస్సార్ సీపీలో చేరారు. చిర్ల ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల వైయస్సార్సీపి కన్వీనర్ శ్రీనివాసు, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, వైసీపీ నేత తోరాటి రాంబాబుతో పాటు కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అగ్రనేతలు పాల్గొన్నారు.