Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వి కె రాయపురం లో చర్చ్ వివాదం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– తప్పుడు ధ్రువపత్రాలతో ….మీసం చేస్తూన పాస్టర్ పై
చర్యలు తీసుకోవాలని
– ప్రభుత్వభూమిమి కాపాడలంటూ నినాదాలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి కె రాయపురం:

 

– వి కె రాయపురం ప్రజలు ఆందోళన

కాకినాడ, విశ్వం వాయిస్ః

గత ముప్ఫై ఏళ్ళుగా కలిసిమెలిసి ఉంటున్న తమ మద్య చిచ్చును పెట్టి ప్రభుత్వాన్నీ,కోర్టులను సైతం మోసం చేస్తున్న పాస్టర్ ఏసురత్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకట కిష్టరాయపురం ప్రజలు బుధవారం ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే సామర్లకోట మండలం వికే రాయపురంలో సర్వే నెంబరు 20/3 లో తాము ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లల్లో గత ముప్ఫై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామనీ తమ నివాస ప్రాంతంలో ఒక చర్చి నిర్మించుకునీ రెండు కులాలు అయిన మాల, మాదిగ సోదరులు రెండు పూటలు ప్రార్ధనలు చేసుకుంటున్నామనీ అయితే సదరు చర్చి పాస్టర్ అయిన ఏసురత్నం చర్చి స్ధలాన్నీ కాజేయాలనే ఉద్దేశంతో తప్పుడు దృవపత్రాలు పుట్టించి కోర్టులో చర్చి ఉన్న ప్రాంతానికి సంబంధం లేని సర్వే నెంబరుతో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి తమను ప్రార్ధనలు చేసుకోకుండా బయ బ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సదరు చర్చి స్ధలంపై ప్రభుత్వ అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని, తప్పుడు దృవపత్రాలతో మోసం చేస్తున్న పాస్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్నారు. ఈ మోసపూరితమైన చర్యకు తాము సామర్లకోట మండలం తహశీల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగిందని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
పాస్టర్ వల్లూరి సరబంది రాజు, కొమ్ము కృష్ణ, దొండపాటి శ్యామ్ బాబు, ఉల్లంపర్తి నూక రాజు, అయినవాల్లి మల్లేష్, కింతల సత్తిబాబు, మందపల్లి సత్తిబాబు, కుందూరు నాగేంద్ర, ఏసుబబు, కృపనందం,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement