Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సర్వ సభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చీర్ల

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులు శ్రద్ధ వహించండి ఎమ్మెల్యే చీర్ల

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

 

ఆత్రేయపురం :విశ్వం వాయిస్ న్యూస్; వేసవిలో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి చూడాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం మండల పరిషత్ కార్యాలంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షురాలు కుండా అన్నపూర్ణ అద్యక్షత వహించగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు . గత రెండున్నర సంవత్సరాలలో ఆత్రేయపురం మండలం లో నూట యాభై కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ పధకాల ద్వారా ప్రజలకు లబ్ది చేకూరిందన్నారు. వేసవికాలాన్ని దృష్టి లో ఉంచుకొని, త్రాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు, అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.అని పేర్కొన్నారు. తాడిపూడి నుండి ఆర్టీసీ బస్సు సర్వీసు లు నడపాలనీ , అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాల అంచనాలలో సిమెంట్ రేటు బయట మార్కెట్ రేటు కంటే బాగా తక్కువగా ఉందనీ, దాని వల్ల ప్రభుత్వం సిమెంట్ సరఫరా చేయాలనీ ,అలాగే హౌసింగ్ లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం ద్వారా సిమెంట్ సరఫరా చేయాలని ప్రజాప్రతినిధులుఅడిగారు. గ్రామాలలో త్రాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, వ్యవసాయం, విద్య, ఇరిగేషన్ తదితర అంశాలపై చర్చించారు. వ్యవసాయ సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చిర్ల ప్రారంభించారు.ఆత్రేయపురం లో పుంతరోడ్డు నిర్మాణం చేయాలని రైతులు కోరగా, పుంతరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.. ఈ సమావేశంలో జడ్పీటీసీ బోనం సాయిబాబా, ఎంపీడీఓ నాతి బుజ్జి, తాహశిల్దార్ ఎం రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్లు పి.బంగార్రాజు, ఎన్.రాణి, ఎంపీటీసి సభ్యులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement