విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం..(విశ్వం వాయిస్ న్యూస్) అమలా పురానికి చెందిన.స్నేహిత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఓఎన్జీసీ మరియు కె.జి బేసిన్ వారి సహకారంతో పి గన్నవరం మండలంలోని మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ట్రైనింగ్ అయిన సభ్యులకు కుట్టుమిషన్లు అందజేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.స్నేహత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఇటువంటి మరెన్నో కార్యక్రమాలను చెయ్యాలని మా పిగన్నవరం ప్రజల తరుపు కోరుకుంటున్నానన్నారు
స్నేహిత స్వచ్ఛంద సేవా సంస్థఫౌండర్.కుంచే స్వర్ణలత మాట్లాడుతూ ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందుండాలని కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న కుటీర పరిశ్రమల లాంటి అలవర్చుకోవాలని అన్నారు మా ఫౌండేషన్ ద్వారా పిగన్నవరం మండలంలోని 45 రోజులు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి 50 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు
మా ఫౌండేషన్ ద్వారా 2005 వ సంవత్సరం నుండి చాలామందికి వరదల సమయంలో.కరోణ కష్టకాలంలో కూడా ఆరోగ్య పరంగానూ విద్యాపరంగానూ సేవలందిస్తున్నామని రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ మేనేజర్ ఎం.వీ.మోహన్ రావు.కె.జి.బేసిన్ కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్.డీ. సీ.ఎం కె.జి.బేసిన్ వి.వెంకన్న.పి గన్నవరం గ్రామపంచాయతీ సర్పంచ్ బొండాడనాగమణి.పి గన్నవరం మండల ప్రజాపరిషత్అభివృద్ధి అధికారి ఐ.ఇ. కుమార్.స్థానిక ఎంపీటీసీ సభ్యులను స్నేహిత స్వచ్ఛంద సేవా సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్నేహితా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నార