Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– నగర ఎమ్మెల్యే ద్వారంపూడి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వలంటీర్లు వారధులుగా పని చేస్తున్నారని నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో నగర మేయర్ సుంకర శివ ప్రసన్నసాగర్ అధ్యక్షతన శనివారం వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు గ్రహీతలకు సత్కార కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హతే ప్రాతిపదికగా లబ్ధిదారులకు అందించడంలో వలంటీర్ల పాత్ర వెలకట్టలేనిదన్నారు. కేవలం గౌరవ వేతనం తో సమాజసేవకులు గా విశిష్ట సేవలు అందిస్తూ ఆయా కుటుంబాల్లో ఒకరిగా కలిసిపోయారన్నారు. ముఖ్యంగా కరోనా వంటి కష్టకాలంలో వలంటీర్లు అందించిన సేవలు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చాయన్నారు. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఇచ్చే దీవెనలే వలంటీర్ల భవిష్యత్తుకు పునాది అన్నారు. వలంటీర్లు మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే ద్వారంపూడి కోరారు.
మేయర్ సుంకర శివ ప్రసన్న సాగర్ మాట్లాడుతూ సేవా దృక్పథంతో వలంటీర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు. వీరి సేవా స్ఫూర్తిని గుర్తించి ముఖ్యమంత్రి అవార్డులు నగదు,పురస్కారాల ప్రకటించారన్నారు. స్వచ్ఛంద సేవకుల్లా పని చేస్తున్న వలంటీర్ల కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు దూరంగా నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలన్న సంకల్పం తోనే ముఖ్యమంత్రి వలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వలంటీర్లు సమర్ధవంతంగా పని చేస్తున్నారన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు మాట్లాడుతూ వలంటీర్ల పనితీరే ప్రాతిపదికగా సేవ వజ్రా, సేవ రత్న, సేవా మిత్ర అవార్డులకు ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. నగర నియోజకవర్గ పరిధిలో 1609 మంది వలంటీర్లకు కోటి 62 లక్షల 70 వేల రూపాయలు నగదు పురస్కారాలు అందించామన్నారు. డిప్యూటీ మేయర్ లు చోడిపల్లి సత్యప్రసాద్, మీసాల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి పేదవానికి ప్రభుత్వ పథకాలను అందించడంలో వలంటీర్లు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారన్నారు.
వివిధ డివిజన్లో నుంచి వచ్చిన వాలంటీర్లు సూర్య కళ, నాగమణి,నాగార్జున మాట్లాడుతూ వాలంటీర్లుగా పని చేసే అవకాశం దక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమను కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో
టీపీఆర్ఓ కృష్ణమోహన్ అతిథులను వేదికపైకి ఆహ్వానించగా, డిప్యూటీ కమిషనర్ ఏసుబాబు, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, స్టాండింగ్ కమిటీ సభ్యులు,కార్పొరేటర్లు, వాలంటీర్లు, సచివాలయ, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement