Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

“” మెడెను పురస్కరించుకుని (యూటీఎఫ్) మండలశాఖ ఆధ్వర్యంలో””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగి:

 

తొండంగి: మే 1: విశ్వం వాయిస్ న్యూస్:
మేడేను పురస్కరించుకుని యుటిఎఫ్ కాకినాడ జిల్లా తొండంగి మండలం,తొండంగి మండలశాఖ ఆధ్వర్యంలో ఎంపియుపిస్కూల్, పంపాదిపేటవద్ద యుటిఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.ఈకార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షురాలు కామ్రేడ్ వరలక్ష్మి అధ్యక్షత వహించి ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.మండల ప్రధాన కార్యదర్శి టి.సత్తిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని,ఉద్యోగ ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు తెలియజేస్తుంటే,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల పరిష్కారం వైపు దృష్టి పెట్టకుండా రకరకాల నిర్బంధాలకు గురి చేస్తున్నాయని, ఈ వైఖరి ప్రజాస్వామ్యంలో మంచిదికాదని,ఈ విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐక్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది.
కె.వి.కె.మహేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాద్యాయుల సమస్యల పరిష్కరంకొరకు యుటిఎఫ్ చేపడుతున్న పోరాటాలు అనిర్వచనీయం అని,మేమంతా యుటిఎఫ్ తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతం చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సినియర్ కామ్రేడ్ సత్యానారాయణ,కార్యదర్సులు కొండబాబు,నాగేశ్వరరావు,పి.సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement