Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

” ప్రపంచ కార్మికుల సొంతం మేడే

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:

 

శంఖవరం, మే 1, (విశ్వం వాయిస్ న్యూస్) ;

కార్మిక దినోత్సవం అంటే ఏ కొందరిదో కాదని, ప్రపంచం మొత్తం మీద నిర్ణీత పని వేళల్లో కాయ కష్టం చేసి సమానమైన పనికి సమాన వేతనం పొందుతున్న ప్రజలు అందరి సొంతమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రం శంఖవరంలో మే డే వేడుకలను ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల ఆత్మ గౌరవ ప్రతీకైన కార్మిక పతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వేడుకల కేకును కట్ చేసి అందరికీ పంచారు. స్థానిక ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం గొదాము పక్కనే ఉన్న ప్రభుత్వ నీటి పారుదలశాఖ సాగు నీటి కాలువ వొడ్డున నీటి పారుదలశాఖ ఖాళీ స్థలంలోని సెంటున్నర భూమిలో శ్రీలక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన కార్మిక భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసారు. స్థానిక శ్రీవల్లీ, దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పూజారి చదువుల సాయికుమార్ శంకుస్థాపన పూజలను చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పధకాలను అమలు చేస్తున్నదని, వాటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ కార్మిక చట్టాల ప్రకారం ప్రతీ కార్మికుడూ ప్రభుత్వంలో నమోదు అయ్యేలా చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అంతే గాకుండా కార్మికులకు ఒక వేదికగా, కార్యాలయంగా నిర్మించనున్న ఈ భవన నిర్మాణం వ్యయంలో రూ. 50,000 లను తన వంతు విరాళంగా ఇస్తానని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్ర ప్రసాద్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వత రాజబాబు, శంఖవరం ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, శ్రీలక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర కార్మిక సంఘం అధ్యక్షులు పడాల సతీష్, ఉపాధ్యక్షుడు మైనం విష్ణు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement