విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట (విశ్వం వాయిస్ న్యూస్)
మండపేట. బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి వైయస్సార్సీపి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని శాసనమండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు అన్నారు. సోమవారం మండపేట వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో పట్టణం మరియు మండపేట రూరల్ మండ లాల ఆధ్వర్యంలో ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు శాసనమండలి సభ్యులు తోట ని కలిసి పూలమాలవేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కులములో జరిగే వివాహాది శుభకార్యాలు నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నామని దీనిని దృష్టిలో పెట్టుకుని మండపేట, ద్వారపూడి , కేశవరం, తాపేశ్వరం గ్రామాల్లో ఎక్కడైనా స్థలం కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్సీ త్రిమూర్తులు స్పందించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంగదల సత్యనారాయణ, కార్యదర్శి సంగడల వెంకటరమణ, భారత మాచరాయ్, భారత వీరబాబు, కౌన్సిలర్ అమలదాసు లక్ష్మీ రుద్రమూర్తి . సింగం రాంబాబు, సమతం పాపారావు. తదితరులు పాల్గొన్నారు.
___________________________________________