విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:
పెనుమంట్ర (విశ్వంవాయిస్ ప్రతినిధి)
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వెలగలేరు సొసైటీ చైర్మన్ కొవ్వూరి బ్రహ్మేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ శాఖ అధికారి కే.రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచులు, సొసైటీ చైర్మన్ లు అట్టహాసంగా ప్రారంభించారు. నెగ్గిపూడి గ్రామంలో గల రైతు భరోసా కేంద్రంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీ పెనుగొండ లక్ష్మి ప్రారంభించారు.వార్డు సభ్యులు గుత్తుల సాల్మన్ దొర మాట్లాడుతూ దళారులను నమ్మి పెద్ద ఎత్తున రైతులు మోసపోతున్నారని, వ్యవసాయం లాభసాటి చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలను స్థాపించి రైతు ముంగిటకు సేవలను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్లం సాయిరెడ్డి,వార్డు సభ్యులు పెనుగొండ నరసింహమూర్తి, సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,అల్లం భాస్కర్ రెడ్డి,ఏ ఈ ఓ దుర్గ భవాని పాల్గొనగా సర్పంచ్ ఎం. ధనలక్ష్మి,మండల వైసీపీ కన్వీనర్ సత్తి విష్ణు కుమార్ రెడ్డి,రైతు నాయకులు సత్తి వెంకటరెడ్డి తదితరులు ఆర్బీకే సేవలను వినియోగించుకోవాలని కోరారు.