Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎస్పీ గారూ… మా కుమార్తెను వెతికి అప్పగించండి…:

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

" బాధిత తల్లి. తండ్రుల వేడుకలు"

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:

 

శంఖవరం, మే 3, (విశ్వం వాయిస్ న్యూస్) ;

మా కూతురు ఆచూకీ తెలియడం లేదు… పోలీసులకు ఫిర్యాదు చేశాము… వారు వెతికే ప్రయత్నం చేయడం లేదు… మా కేసును కాస్త పట్టించుకుని న్యాయం చేయండయ్యా అంటే మా మాట వినడం లేదు…. ఎస్పీ గారూ… మీరైనా మాపై దయ తలచి మా బిడ్డను వెతికించి మాకప్పగించండంటూ ఓ దంపతుల జంట కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు నేరుగా విన్నవించుకున్న వైనమిది. ఇదే జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని జల్దాం గ్రామానికి చెందిన కించి జగ్గారావు కూతురు ఇటీవల కాలంలో ఆచూకీ కనిపించకుండా పోయింది. దీంతో జిల్లా ఎస్పీని సోమవారం స్పందన కార్యక్రమంలో కలసి ఫిర్యాదు చేశారు.

తమ కూతురు కనిపించడం లేదని మార్చి 21 వ తేదీన తన భార్యతో కలిసి కిర్లంపూడి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశానని క్రైం నెంబర్ 58/22 ఉమెన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేశారని, అలాగే తమకు తెలిసిన ఆధారాల ప్రకారం తమకు రౌతులపూడి మండలం డి.పైడిపాల గ్రామానికి చెందిన రాయి దర్గా ప్రసాద్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని, అతను గ్రామంలో ఖాళీగా ఉన్న భూములకు దొంగ పత్రాలను సృష్టించి అమ్మిన డబ్బుతో చాలా మందిని మోసం చేసినట్లుగా కూడా చెప్పామని, తమ కూతురికి సంబంధించిన వివరాలు, దుర్గాప్రసాద్ ఫోన్ నెంబర్లను స్టేషనులో ఇవ్వగా, విచారణ చేసి తేలుస్తామని స్టేషన్ ఎస్ఐ చెప్పారని, ఫిర్యాదు చేసిన నాటి నుండి ఎస్ఐని ప్రతి రోజూ కలుస్తున్నప్పటికీ ఏమి సమాధానం చెప్పడం లేదని, ఈ కేసులో ఎస్ఐ అవతలి వ్యక్తుల వద్ద లంచం తీసుకున్నట్లుగా ఊరిలో అందరూ మాట్లాడుతూ ఉన్నారని, ఎస్ఐని అడుగుగా ఆయన కోపగించుకుని, ఎస్టి నా కొడుకులకు ఇది మామూలే కదరా అంటూ ఎస్ఐ తనను, తన భార్యను కులం పేరుతో నోటికి వచ్చిన విధంగా దుర్భాషలతో తిట్టి అవమానించారని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కూతురిని ఎలాగైనా వెతికి మాకు అప్పగించి, నిందితులను అరెస్టు చేసి ఎస్ఐపై కూడా శాఖా పరంగా చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సానుకూలంగా స్పందించారని, తమకు న్యాయం చేస్తారని నమ్మకం కలిగిందని ఫిర్యాదు దారులతో పాటు వచ్చిన గ్రామస్తులు స్థానిక మీడియాకు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement