విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
నగరం ప్రశాంతతకు మారుపేరని హిందూ- ముస్లింల మధ్య విద్వేషాలు రేపడం నగర ఎమ్మెల్యేకు తగదని బిజెపి నాయకులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరును ప్రస్తావించకుండా ఆరోపించారు. మతసామరస్యానికి ప్రతీకగా దేశంలో బిజెపి ఆదర్శంగా నిలుస్తుందని వారు అన్నారు. గురువారం స్థానిక గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ హిందూ ముస్లింల మధ్య పరోక్షంగా సిటీ ఎమ్మెల్యే విద్వేషాలు రేపుతున్నారంటూ ద్వారంపూడి పేరును ప్రస్తావించకుండా ఆయనపై పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మీడియా ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణలు అన్నారు. జెఎన్టియులోని ఆరు ఎకరాల స్థల వివాదం కోర్టులో ఉందని దానిని ముస్లిములకు అందజేస్తామంటూ సిటీ ఎమ్మెల్యే చెప్పడం కోర్టు ధిక్కారమేనని మాలకొండయ్య, సత్యనారాయణలు చెప్పారు. నగరంలో జెఎన్టియుకె స్థలం ప్రాంతంలో ముస్లిములు ప్రార్ధన చేసుకోవడం నాటి కాలంగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ స్థలం కోర్టులో ఉన్నప్పటికీ దాన్ని ముస్లిముల మద్దతు కోసం ఎమ్మెల్యే బీజేపీ నేతలపై వ్యాఖ్యలు చేయడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలో బిజెపి నాయకులు ముస్లింల జోలికి వస్తే అంటూ ముస్లింలను వ్యాఖ్యానించడం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడికి తగదంటూ పరోక్షంగా ప్రస్తావించారు. స్థానిక నగరంలో పలు ప్రాంతాల్లో బిజెపి నాయకులను ఎమ్మెల్యే చులకనగా మాట్లాడుతున్నారని సిటీ, ఇతర ప్రాంతాల వైసిపి వారు అభివృద్ధి, సంక్షేమం పేరుతో గెలవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసిపి నాయకులు బిజెపి నాయకత్వంపై వ్యాఖ్యలు చేయాలే తప్పా ఇలా సిటీ ఎమ్మెల్యే రాజకీయాలను ముస్లింల పేరుతో చేయడం తగదన్నారు. తమ రాష్ట్ర అధినాయకత్వంపై వైసిపి వారు రాజకీయం చేస్తే బిజెపి తమ సత్తా ఏమిటో చూపుతుందని హెచ్చరించారు.10 శాతం ఉన్న ముస్లింలకోసం 90 శాతం ఉన్న హిందువులను దూరం చేసుకుంటారా అని వైకాపా నాయకులను మాలకొండయ్య గట్టిలు ప్రశ్నించారు. పోర్టులో అక్రమ వ్యాపారాలు అధికంగా సాగుతున్నాయని దీనిపై ఎమ్మెల్యే విజిలెన్స్ విచారణ వేసి తన సచ్ఛీలత నిలుపుకోవాలని సూచించారు. సిటీ ఎమ్మెల్యే ప్రతిపక్షాలను చులకనగా చూస్తున్నారని గతంలో పలువురు నాయకులపై నోరు పారేసుకున్నారని గుర్తు చేశారు. కాకినాడ చరిత్ర తెలియని వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండటం సిగ్గుచేటని బిజెపి నాయకులు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు పైడా వెంకట నారాయణ, కొక్కిలిగడ్డ గంగరాజు, పి మణి బాల, రామకృష్ణ, కృష్ణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.