విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చిత్తూరు:
*చింతూరు, విశ్వం వాయిస్ న్యూస్:* చింతూరు అటవీ డివిజన్ పరిధిలోని తునికాకును ఇతర రాష్ట్రాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చింతూరు అటవీ క్షేత్రాధికారి శ్రీరామరావు పేర్కొన్నారు.
చింతూరు అటవీ క్షేత్ర పరిధిలోని కుందులూరు, పోతనపల్లి సెక్షన్ల నుండి పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి రాత్రివేళ తునికాకు కట్టలను అక్రమంగా ట్రాక్టర్, ఆటోలలో తరలిస్తుండుగా అటవీ అధికారులు,
సిబ్బందితో బుధవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న తునికాకు పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ పట్టుబడ్డ ట్రాక్టర్లో 2 వేల
తునికాకు కట్టలు, ఆటోలో 2 వేల తునికాకు కట్టలు ఉన్నాయన్నారు. ఈ రెండు వాహానాల్లో పట్టుబడ్డ తునికాకు కట్టల విలువ రూ. 15 వేలు ఉంటుందని తెలిపారు. పట్టుబడ్డ రెండు వాహనాల
మీద, తునికాకు తరలిస్తున్న వ్యక్తుల మీద కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడుతూ తునికాకు ఇతర రాష్ట్రాలకు తరలించడం అటవీ చట్టం ప్రకారం నేరమని పేర్కొన్నారు. తునికాకు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తునికాకును అక్రమంగా వాహనాలు ద్వారా తరలిస్తే ఈ ఫోన్ నెంబరు 9951312126 కి ,
సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ వాహనాలను పట్టుకున్న వారిలో చింతూరు డీఆర్వో శ్రీనివాస్
రావు, కుందులూరు సెక్షన్ ఆఫీసర్ మల్లరావు, బీట్ అధికారులు సరిత, దుర్గా, గిరిష్ కుమార్, నాగార్జున,
వీరయ్య, రంజిత్, బేస్‌క్యాంపు వాచర్స్ తదితరులు పాల్గోన్నారు.