విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి ఆర్ పురం:
వి.అర్.పురం, ( విశ్వం వాయిస్ న్యూస్)06 ;- పేరు చెదల భీమరెడ్డి. వి.అర్.పురం మండలం ధారపల్లి గ్రామం. ఇతనికి ఫిట్స్ వ్యాధి ఉన్నది. ఇతను నిప్పు వద్ద ఉన్నప్పుడు ఫిట్స్ రావడంతో నిప్పులో పడిపోయాడు. కాలు కి నిప్పు అంటుకోవడంతో కాలు మడమ కాలింది. ఇతను తాగిన మత్తులో వైద్యం చేయించుకోక పోవడంతో ఇప్పుడు పురుగులు పడి దుర్వాసన వస్తుంది. మరి గ్రామాల్లో పనిచేసే ఆశా వర్కర్లు, ఏ ఎన్ యంలు కు ఇతని పరిస్థితి తెలియక పోవడంతో నేటికి వైద్యం సరిగా అంద లేదా..? లేక ఇతను వైద్యం చేయించుకోవడంలో ఆశ్రద్ద చేశారా.. అనేది తెలియాలి. ఇప్పటికి కైనా ప్రభుత్వ వైద్య సిబ్బంది వైద్యం అందిస్తే బాగుంటదని, ప్రభుత్వ వైద్య శాల జీడిగుప్ప లో ఉన్న ఆ పక్కనే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారపల్లి గ్రామంలో ఈ కొండరెడ్డి పరిస్థితి ఉన్నది. ఇప్పటి కైనా అతనికి వైద్యం అందించమని కోరుతున్నారు. మీడియా ఆ గ్రామానికి వెళ్లడంతో కొండ రెడ్డి పరిస్థితి గమనించడం జరిగింది.