ఆలమూరు: మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం
అందిస్తున్న సక్రటరీ మోక్ష అంజిలి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్): మండలం పరిధిలో మడికి గ్రామ సచివాలయం-2 లో ఉద్యానశాఖ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన ఉందుర్తి ధనలక్ష్మి (24) కుటుంబానికి ఆర్థిక సాయం లభించింది.మడికి గ్రామస్థులు, గ్రామ పెద్దలు, గ్రామ సచివాలయాల ఉద్యోగుల సహకారంతో గ్రామ సర్పంచ్ యు.లక్ష్మి మోనిక, ఉప సర్పంచ్ పడమట సుజాత, పంచాయతీ కార్యదర్శి కె.మోక్షాంజలి ఆధ్వర్యంలో వాలంటీర్లు అందరూ కలిసి రూ.1,06,300 విరాళాన్ని సేకరించారు. అందులో భాగంగా కార్యదర్శి మోక్షాంజలి, గ్రామ సచివాలయ సమాఖ్య బృందం సభ్యులు శుక్రవారం మృతురాలు నివాసముంటున్న కాట్రేనికోన మండలం చేయ్యెరు తరలివెళ్లారు. ఆగ్రామ సర్పంచ్ చెల్లి సురేష్ సమక్షంలో సేకరించిన విరాళాన్ని ఆకుటుంబ సభ్యులకు అందజేశారు. ఈసొమ్మును మృతురాలు పిల్లల పేరిట బ్యాంకులో డిపాజిట్ చేయాలని కార్యదర్శి మోక్షాంజలి కుటుంబ సభ్యులను కోరారు. ఆమె కోరిన దానికి వారు అంగీకరించారు. గొప్ప మనస్సుతో దాతృత్వాన్ని చాటుకుని పేద కుటుబాన్ని ఆదుకున్న మడికి గ్రామస్థులకు, మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల ఉద్యోగులకు మృతురాలు ధనలక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.