Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,454,496
Total recovered
Updated on June 1, 2023 7:31 AM

ACTIVE

India
4,222
Total active cases
Updated on June 1, 2023 7:31 AM

DEATHS

India
531,870
Total deaths
Updated on June 1, 2023 7:31 AM

నిర్వహితుల సమస్యలు చర్చించుటకై గ్రామసభలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

-ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు,
రాజమహేంద్రవరం వారి ఆదేశాములతో నిర్వహణ.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి ఆర్ పురం:

వి.అర్.పురం,( విశ్వం వాయిస్ న్యూస్) 06- పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు, రాజమహేంద్రవరం వారి ఆదేశముల మేరకు వి.ఆర్.పురం మండలంలో పోలవరం ప్రాజెక్టు కాంటూర్ నెంబరు +41.15 మీటరు నందు నోటిపై కాబడిన ఆర్ఆర్ గ్రామాల యందు నిర్వాసితుల సమస్యలు చర్చించుట కొరకు ఈ క్రింద తెలిపిన తేదీలలో గ్రామ సభలు నిర్వహించబడునని తహసీల్దార్ ఎన్. శ్రీధర్ మీడియాకు తెలియజేయడమైనది.
* ఈ క్రింది వాటి గురించే చర్చ
1. భూమికి సంబంధించిన పరిహారము చెల్లింపుల గురించి
2. ఇండ్ల కు సంబంధించిన పరిహారముల చెల్లింపుల గురించి
3. భూమికి భూమి సంబంధించిన పట్టా మంజూరు చేయుట గురించి.
4. ఆర్&ఆర్ కాలనీ నందు ఇంటి పట్టా మంజూరు గురించి
5. పట్టాదారు మరణించినచో వారసుల పేరున పట్టా మార్పిడి గురించి
6. రెవెన్యూ రికార్డుల యందు పట్టా నమోదు గురించి
7. ఆర్&ఆర్ నగదు చెల్లింపుల గురించి .
8. ఆర్&ఆర్ కాలనీ నందు మంజూరు చేసిన ఇంటి పట్టా గురించి
9. నిర్వాసితులను సంబంధిత ఆర్.&ఆర్ కాలనీకి తరలింపు ప్రక్రియ గురించి చర్చించుట కొరకు.
10. అర్హులైన పిడియఫ్ ల నుండి దరఖాస్తుల స్వీకరణ కొరకు.

* ఆర్ & ఆర్ గ్రామ సభ షెడ్యూలు

7న పోచవరం , ఇప్పురు గ్రామాల్లో గ్రామసభ నిర్వహణ, 10 న కొఠారిగొమ్ము, ములకపల్లి గ్రామాల్లో, 11 న జీడిగుప్ప, ఇసునూరులో12 న చొక్కనపల్లి, కొత్తూరు, శ్రీరామగిరి లో,13 కళ్తునూరు, 16 సీతం పేట,17 న కొల్లూరు, గొందూరు, కొండేపూడి,18 తుమ్మిలేరు,19 తుష్టివారిగూడెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించబడును.

సంబంధిత గ్రామపంచాయితీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు సంబంధిత గ్రామ సభల గురించి గ్రామ పంచాయితీ సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు నిర్వాసితులకు తెలియపరిచి సంబంధిత తేదీ నందు గ్రామ సభలకు హాజరయ్యేవిధముగా చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించడమైనదని తహశీల్దార్ తెలియపర్చడమైనది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!