WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేకంగా ద్రుష్టి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శుక్లా వెల్లడి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది వైద్య సేవ‌ల కోసం స్థానిక జీజీహెచ్‌కు వ‌స్తున్నందున ఈ ఆసుప‌త్రిపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించి అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్ర‌వారం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్‌) కింద రూ. 48 ల‌క్ష‌ల విలువైన వైద్య పరికరాలను అందించే కార్య‌క్ర‌మాన్ని జీజీహెచ్ పీడియాట్రిక్స్ కాన్ఫరెన్స్ హాల్లో క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌స్తుతం రూ. 23 లక్ష‌ల విలువైన వైద్య ప‌రిక‌రాల‌ను జీజీహెచ్‌కు అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని.. మ‌రో రూ. 25 లక్ష‌ల విలువైన వైద్య ప‌రిక‌రాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా వ‌చ్చిన తొలి రోజు నుంచే జీజీహెచ్‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించామ‌ని.. ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆసుప‌త్రి అవ‌స‌రాల మేర‌కు ఇంకా కావాల్సిన వాటిని ప్రాధాన్య క్ర‌మంలో ప్ర‌తిపాద‌న‌లు రూపొందించి పంపాల‌ని క‌లెక్ట‌ర్.. అధికారుల‌కు సూచించారు. జీజీహెచ్‌తో పాటు జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లందించేలా కృషిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మం అనంత‌రం జీజీహెచ్ పీడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవ‌ల వివరాలను కలెక్టర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.. అనంతరం కలెక్టర్.. వైద్య అధికారులతో కలిసి నవజాత శిశువుల అత్యవసర విభాగాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సుపరింటెండెంట్ డా. పి.వెంకటబుద్ధ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జీఎంలు కె.శంకర్‌రావు, జీవీ రావు, పీడియాట్రిక్ హెచ్‌వోడీ డా. ఎంఎస్ రాజు, ఇత‌ర వైద్యాధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement