విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్)
అంగర గ్రామంలో జల జీవన్ పథకం లో భాగం గా ప్రతీ ఇంటికీ తాగు నీటి పైప్ లైన్ పనులు స్థానిక ప్రజాప్రతినిధులు చేతులు మీదుగా ప్రారంభించారు. అంగర సర్పంచ్ వాసా కోటేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి లుగా ఎంపీపీ మేడిశెట్టి సత్య వేణి దుర్గారావు, జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు పాల్గొని భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు,సర్పంచ్ వాసా కోటేశ్వర రావు లు ప్రసంగించారు. కోటి రూపాయలు వ్యయంతో నిర్మింపతలపెట్టిన ఇంటింటి పైప్ లైన్ ద్వారా అంగర గ్రామంలో మొదటి విడత 800 ఇండ్లకు మంచి నీటి సరఫరా జరుగుతుంది అని తెలిపారు. కపిలేశ్వరపురం మండలంలో ఇంత వరకూ నేలటూరు, అంగర గ్రామాలలో జల జీవన్ పథకం ప్రారంభించినట్లు వారు తెలిపారు. జలమే జీవ రాశుల మనుగడకు ప్రధాన ఆధారం అని, కావున ప్రతీ నీటి బొట్టూ పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగర గ్రామ ఎంపీటీసీ లు మేడిశెట్టి దుర్గారావు,అడ్డాల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ యర్రా వీరన్న బాబు, పి ఎ సి ఎస్ చైర్ పర్సన్ గంగుమళ్ళ రాంబాబు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గుడిమెట్ల శివ రామ కృష్ణ, బడుగు రాంబాబు, ప్రగడ అర్జునరావు, నల్లూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు అతుకుల శంభు లింగం,పంచాయితి కార్యదర్శి కామేశ్వరరావు, వీ ఆర్ వో నాగ మని, గుత్తేదారు వాసు,పంచాయితీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.