కిట్లు అందజేస్తున్న కపిలేశ్వరపురం సిడిపిఓ గజలక్ష్మి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్ ):రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ ఆరోగ్య పోషణ కిట్లను చిన్నారులు, బాలింతలు, గర్భిణులు సద్వినియోగం చేసుకుని రక్తహీనత నుంచి రక్షణ పొంది మెరుగైన ఆరోగ్యాన్ని సాధించాలని కపిలేశ్వరపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడిపీఓ అధికారి గజలక్ష్మి అన్నారు. మండలం లోని చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం గ్రామాల్లో శనివారం ఆమె పర్యటించి ఇటుక బట్టి కార్మికులకు పౌష్టికాహారం అందుతున్న విధానాన్ని పరిశీలించారు. సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. నిర్ణీత వయస్సు ఆధారంగా బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి ఆరోగ్య సిబ్బంది సహకారంతో సత్వరమే సమీప వైద్య కేంద్రానికి తీసుకు వెళ్లాలని అంగన్వాడిలను సీడిపీఓ గజలక్ష్మి ఆదేశించారు. కార్మికుల ఆరోగ్య రక్షణ పట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఆరు రకాల వస్తువులు కలిగిన వైఎస్సార్ సంపూర్ణ ఆరోగ్య పోషణ కిట్లను అందజేశారు