విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:
కరప, విశ్వం వాయిస్ న్యూస్;
కరప మండల కేంద్రమైన కరప గ్రామంలో కొణేదల చిరంజీవి కల్యాణమండపం నందు సోమవారం ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు. లోన్స్ మంజూరు చేసిన పట్టాదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడివో కర్రీ స్వప్న, తహసీల్దార్ పి శ్రీనివాసరావు, హోసింగ్ ఏఈ సోమురెడ్డి, పి ఆర్ ఏఈ శైలజ, గ్రామ ప్రెసిడెంట్ సాదే ఆశా జ్యోతి లోహిదాస్, తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు: ఫేజ్ 1 లోన్స్ మంజూరు అయిన గ్రామస్తుల పట్టా దారులతో, ఎంపిడివో స్వప్న, తాహిల్దార్ శ్రీనివాసరావు, ఏఈ సోమురెడ్డి, మాట్లాడుతూ కరప గ్రామం నందు. లేఔట్- 2 నెంబర్ కి 63 ఇళ్ల లోన్స్, వలసపాకాల గ్రామం నందు. మెగా లేఔట్-3 నెంబర్ కి
702 ఇళ్ల లోన్స్, కరప అట్లప్యాక్తరి నందు. లేఔట్- 8 నెంబర్ కి
52 ఇళ్ల లోన్స్, కరప రామకంచిరాజు నగర్ నందు. 9 నెంబర్ కి12 ఇళ్ల లోన్స్, 10 నంబర్ కి 46 ఇళ్ల లోన్స్ మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం మీకు 72 గజాలు చొప్పున స్థలం ఇచ్చి ప్రతి ఇంటికి రూ 1.80.000 లోన్ ఇచ్చింది. మీరు
త్వరగా ఇళ్ల పనులను మొదలపెట్టండి మీకు ప్రభుత్వం ఇసుక సిమెంట్ ఐరన్ ఇస్తుంది మీరు త్వరగా బెస్మెంట్స్ వేస్తె హోసింగ్ లోన్స్ వస్తాయని పట్టా దారులకు వివరించారు.