విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ముమ్మిడివరం విశ్వం వాయిస్ రిపోర్టర్.
ఆక్వా సెజ్ ను రెట్టింపు చేసిన జగన్ ప్రభుత్వం. ఆక్వా రైతులను వరి రైతులను నిలువునా మంచి వారికి రావలసిన సబ్సిడీలను రద్దు చేసి సెజ్లను రెట్టింపు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొలకోటి దొరబాబు పేర్కొన్నారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ముమ్మిడివరం టిడిపి కార్యాలయంలో మండల పార్టీ సమావేశం జరిగినది ఈ సమావేశానికి అర్థాని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో దొరబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని రైతులకు ఒక శాతం ఉండగా దానిని రెండు శాతం పెంచారని ఆక్వా రైతులకు 50 పైసలు ఉండగా రూపాయికి పెంచారని అలాగే ఎలక్ట్రికల్ ఛార్జీలు విపరీతంగా ఆక్వా రైతులకు పెంచారని అన్నారు హెచ్పీ ట్రాన్స్ఫర్ లు సబ్సిడీ పూర్తిగా తీసేశారని ఆయన ఎద్దేవా చేశారు అనంతరం నగర పంచాయతీ టిడిపి అధ్యక్షులు దొమ్మెటి రమణ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు జిల్లా పర్యటన విజయవంతం అవడానికి ప్రజలు వైసీపీ ప్రభుత్వం పై విసుగుచెంది ఉన్నారని అందుకే ప్రజలు స్వచ్చందంగా వచ్చి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేశారని అన్నారు అనంతరం బొజ్జల గోపాలకృష్ణ మృతికి సంతాపం తెలియజేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగాను ఐటీ మంత్రిగా పలు సేవలు చేశారని పలువురు కొనియాడారు ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్, కోనసీమ జిల్లా టిడిపి ఎస్సీసెల్ నాయకుడు పొద్దుకు నారాయణరావు( బాలు), పొత్తూరి విజయభాస్కర వర్మ ,తాడి నరసింహారావు, పిల్లి నాగరాజు, నగరపంచాయతీ ఫ్లోర్ లీడర్ ములపర్థి బాలకృష్ణ, కడలి నాగు , మిమ్మితి చిరంజీవి, కురసాల శివ , యాల్ల ఉదయ్, బొంతు నాగరాజు,చిక్కాల అంజి బాబు ,మట్ట సత్తిబాబు, పాయసం చిన్ని, గొల్లపల్లి గోపి ,నడింపల్లి శ్రీనివాస రాజు, మోర్త ప్రసాద్ ,కాశి రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.